Vijay Deverakonda Liger Movie.. ఏదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు. కాదు కాదు, కాపీ కొట్టేసినట్టున్నారు. లేకపోతే అనాచ్ఛాదిత శరీరానికి, ‘ప్రైవేటు పార్టు’ వద్ద ఓ పుష్ప గుచ్చం అడ్డం పెట్టి, దాన్ని పోస్టర్‌గా వదలడమేంటి.?
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతన్న ‘పాన్ ఇండియా’ సినిమా లైగర్. ఆగస్టు నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘లైగర్ హంట్’ (Liger Hunt) అంటూ, సినిమా ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. పాత్ర కోసం విజయ్ ఏమైనా చేస్తానడానికి, గతంలో ఆయన చేసిన సినిమాలే నిదర్శనం.
తొలి సినిమా దగ్గర్నుంచి, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కోసం (Liger Saala Cross Breed) ప్రయత్నిస్తూనే వున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).

అందుకే, బోల్డంత మంది రౌడీస్ (యూత్.. అమ్మాయిలూ, అబ్బాయిలూ..) రౌడీ హీరో విజయ్ దేవరకొండకి కరడుగట్టిన అభిమానులుగా మారిపోయారు.
Vijay Deverakonda Liger Movie ఇలా ఎందుకు చేశావ్ రౌడీ.?
అందుకే, విజయ్ దేవరకొండ ఏం చేసినా, ఆయన అభిమానులకు నచ్చేస్తుంటుంది. ‘సాలా క్రాస్ బ్రీడ్..’ అంటూ విజయ్ దేవరకొండ, ‘లైగర్’ సినిమాలోని తన పాత్ర గురించి చెప్పుకుంటున్నా, అదో ఘనతగా ఫీలైపోతున్నారు చాలామంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుండడం గమనార్హం.
అన్నీ బాగానే వున్నాయ్.! కానీ, విజయ్ దేవరకొండ మీద ఇలాంటి పోస్టర్ (Liger Movie) డిజైన్ చేయించాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌కి ఎందుకు అనిపించిందో ఏమో.!
Also Read: బేబమ్మ ఆన్ బోర్డ్.! లక్కు తోక తొక్కేసిందంతే.!
పూరి సినిమాల్లో హీరోయిన్లు హాట్‌గా వుంటారు. ఈ సినిమాలో హీరో కూడా హాట్‌గా వుండాలని బహుశా పూరి అనుకున్నాడేమో.!
తేడాగా చూడొద్దు.! చూసే మీ కళ్ళలోనే ఆ తేడా వుంటుందని పూరి చెప్పినా చెప్తాడు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ‘తేడా ప్రచారం’ చాలా చాలా గట్టిగా జరుగుతోంది. విజయ్ అభిమానులు, ఈ ‘తేడా’ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.