Vijay Deverakonda Rashmika Mandanna అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ‘రౌడీ లైగర్’ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
అలా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫొటో కాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.!
మాల్దీవుల్లో మజా చేస్తున్న ఫొటో అది. చేతిలో షాంపేన్ బాటిల్ కూడా కనిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో విజయ్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.
లొకేషన్ అదిరిపోయింది.! నిజానికి, ఆ లొకేషన్‌తోనే అసలు సమస్య. ఇలా ఎలా జరిగిందబ్బా.?
Vijay Deverakonda Rashmika Mandanna అప్పుడేమో రష్మిక..
కొన్నాళ్ళ క్రితం రష్మిక (Rashmika Mandanna) మాల్దీవ్స్‌కి వెళ్ళింది. అక్కడ కొన్ని హాట్ అండ్ వైల్డ్ యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా.

ఆ ఫొటోల్లో ఒక ఫొటో ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పోస్ట్ చేసిన ఫొటోతో మ్యాచ్ అవుతోంది.. అదీ లొకేషన్ పరంగా.! సేమ్ స్పాట్.. ఇద్దరు సెలబ్రిటీలు.. పైగా, రెండు సినిమాల్లో కలిసి నటించిన హీరో హీరోయిన్లు.!
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చూడముచ్చటైన జంట.. ఇద్దరి మధ్యా సమ్‌థింగ్ సమ్‌థింగ్.. అంటూ అప్పట్లోనే గాసిప్స్ వచ్చాయ్.
ఇప్పుడు మళ్ళీ ఈ మాల్దీవ్స్ ఫొటోల జాతర ఒకటి.
సమ్‌థింగ్ సస్పీషియస్ కదా.? అప్పట్లోనే విజయ్, రష్మిక జంటగా మాల్దీవ్స్‌కి వెళ్ళారనే ప్రచారం జరిగింది.
అయితే తప్పేంటట.!
ఒకే స్పాట్‌లో ఇద్దరు సెలబ్రిటీలు ఫొటోలు దిగకూడదా.? అందులో తప్పేముంది.? ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చినా తప్పు పట్టాల్సిందేమీ లేదు.
Also Read: Butterfly Review: అనుపమని సరిగ్గా వాడలేదే.!
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కోసం ఒకే బెడ్ మీద ‘యుద్ధం’ చేసేస్తున్నట్లుగా నటించేస్తారు నటీనటులు. అది సినిమా.! ఇది రియల్ లైఫ్.!
ట్రెండ్ మారింది.. స్నేహాలకు అర్థాలూ మారుతున్నాయ్.! సో, ఈ ఫొటోల్ని తప్పు పట్టడానికేమీ లేదు. అయినాగానీ, సోషల్ రచ్చ కొనసాగుతూనే వుంటుంది కదా.? ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత.!