Vijay Deverakonda మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
అయితే, ఆ ప్రాజెక్టులోకి చరణ్ స్థానంలో విజయ్ దేవరకొండ వచ్చి చేరినట్లు కనిపిస్తోంది. ‘జెర్సీ’ సినిమాతో దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.
ఆ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ, కుదరలేదు.
అయితే, ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో గౌతమ్ (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని రామ్ చరణ్ అంటున్నాడు.
Vijay Deverakonda.. ప్రీ లుక్..
కాగా, గౌతమ్ తిన్ననూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ని తాజాగా విడుదల చేశారు.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ దెబ్బకి ‘దిల్’ రాజుకి పగిలింది.!
ఈ పోస్టర్ కూడా గతంలో రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కోసమే డిజైన్ చేసిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పోలీస్ గెటప్‌లో వున్న వ్యక్తి, ఫేస్‌ని కవర్ చేసి, ప్రీ-లుక్ విడుదల చేశారు.
పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తారు.
Don’t Know
Where I Belong
To Tell You
Whom I Betrayed
Anonymous Spy
ఇదీ ఈ సినిమా గురించి మేకర్స్ రివీల్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.