Home » తమిళనాడు రాజకీయాల్లో టీవీకే దళపతి విజయ్ సత్తా ఎంత.?

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే దళపతి విజయ్ సత్తా ఎంత.?

by hellomudra
0 comments
TVK Vijay

Vijay TVK Political Stamina.. సినీ పరిశ్రమలో ‘దళపతి’ అనేది, హీరో విజయ్‌కి వున్న ప్రత్యేకమైన గుర్తింపు. మరి, రాజకీయ రంగంలో ఆయనెలాంటి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు.?

అందరికీ తెలిసిన విషయమే.. సినిమాలు వేరు, రాజకీయం వేరు. విజయ్ కాంత్‌ని చూశారు తమిళ ప్రజలు.. కమల్ హాసన్‌ని కూడా చూశారు తమిళ ప్రజలు.. అదీ, రాజకీయాల్లో.

రజనీకాంత్ అయితే, రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించి, ఆ తర్వాత చేతులెత్తేశారు. తమిళ రాజకీయాల్లో నిజానికి, సినీ గ్లామర్ ప్రభావం చాలా ఎక్కువ.

జయలలిత సినీ నటి, తమిళనాడుకి పలు మార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. కరుణానిధికి కూడా సినీ రంగంతో సన్నిహిత సంబంధాలున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో స్టార్ పొలిటీషియన్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఎంజీఆర్ సంగతి సరే సరి. మరి, విజయ్ పరిస్థితి ఏమవుతుంది.?

Vijay TVK Political Stamina.. పోటీ ఎన్ని చోట్ల.? గెలిచేది ఎన్ని సీట్లు.?

ఎన్ని స్థానాల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేస్తుంది.? ఎన్నిచోట్ల విజయ్ పోటీ చేస్తాడు.? మిగతా స్థానాల్లో టీవీకే పార్టీకి అభ్యర్థులు వున్నారా.?

నిజానికి, ఎన్నికల సంఘం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మార్చి నెలలో ప్రకటన వస్తుందనీ, ఏప్రిల్‌లో రావొచ్చనీ.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దాదాపుగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి. ప్రధానంగా పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే వుంటుంది.

చిన్నా చితకా పార్టీల ప్రభావం కూడా ప్రధాన పార్టీల గెలుపోటముల్ని శాసించే స్థాయిలోనే వుంటుంది.. అంటే, ఆయా పార్టీల ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టడం లాంటిదన్నమాట.

మరి, విజయ్ పార్టీ టీవీకే పోషించబోయే పాత్ర ఏంటి.? 180 స్థానాలపై విజయ్ కన్నేశారన్న ప్రచారంలో నిజమెంత.? గ్రౌండ్ రియాల్టీ ఏంటి.?

‘అబ్బే, విజయ్‌కి అంత సీన్ లేదు..’ అనే అభిప్రాయమే గ్రౌండ్ లెవల్‌లో వినిపిస్తోంది. పైగా, తన సినిమా ‘జన నాయగన్’ని విడుదల చేసుకోవడానికే విజయ్ నానా తంటాలూ పడాల్సి వస్తోంది.

ఏదిఏమైనా రాజకీయాలనేవి ముందస్తు అంచనాలకు అందనివి. ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అనుకోవడం మామూలే.!

విజయ్ పార్టీ 180 స్థానాల్లో పోటీ చేస్తే, అదో సంచలనం అవుతుంది. అయితే, విజయ్ ఏదో ఒక పార్టీతో కలవాల్సిందేనన్నది తమిళ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.

ఒకవేళ విజయ్, వేరే పార్టీతో కలిస్తే మాత్రం.. చెప్పుకోదగ్గ సీట్లేవీ విజయ్ పార్టీకి కేటాయించబడవు. ఆ మాటకొస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ గెలిచి, అసెంబ్లీకి వెళ్ళడమే అంత తేలికైన వ్యవహారం కాదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group