Vijaya Sai Reddy Hindutwa.. విజయ సాయి రెడ్డి ఎవరో తెలుసు కదా.? మాజీ ఎంపీ.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత.! చార్టెర్డ్ అకౌంటెంట్ కూడా.!
అంతేనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట, అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు జైలుకు వెళ్ళిన వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటే.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరు.? ఆయనది ఏ మతం.? అంటే, ‘నా మతం మానవత్వం’ అంటారు వైఎస్ జగన్.! వైఎస్ జగన్ తల్లి మాత్రం, తన కుమారుడు క్రిస్టియన్ అని చెబుతారు.
‘నేను, నా భర్త రాజశేఖర్ రెడ్డి.. మేమిద్దరం క్రిస్టియన్స్.. మా జగన్ బాబు కూడా క్రిస్టియనే..’ అని తన పుస్తకంలో కూడా రాసుకున్నారు జగన్ తల్లి విజయమ్మ.
Vijaya Sai Reddy Hindutwa.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు..
ఇక, వైఎస్ షర్మిల సంగతి సరే సరి.! షర్మిల భర్త అనిల్ కుమార్ అంటే, క్రైస్తవ మత ప్రచారకుడు.! ఆ అనిల్ కుమార్‌తో మత మార్పిడుల్ని ప్రోత్సహించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర్నుంచీ, వైఎస్ కుటుంబంతోనే వున్నారు విజయ సాయి రెడ్డి.! అలాంటి విజయ సాయి రెడ్డి వున్న పళంగా, ‘డబ్బు ఆశ చూసి మతం మార్చాలని ప్రయత్నిస్తే గుణపాఠం చెప్తాం’ అనడమేంటి.?
ఇదే మరి ట్విస్టు అంటే.! సోషల్ మీడియా వేదికగా విజయ సాయి రెడ్డి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీటులో ఏముందంటే..
హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం.
గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి.
దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి .. అదే భారతదేశానికి రక్ష … శ్రీరామ రక్ష.
ఈ మార్పు నిజమేనా.?
ఇంతకీ, విజయ సాయి రెడ్డిలో ఈ మార్పుకి కారణమేంటి.? అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే ఓ ప్రకటన చేశారు విజయ సాయి రెడ్డి.
బీజేపీతో విజయ సాయి రెడ్డికి అత్యంత సన్నహిత సంబంధాలున్నాయి. ఆ పార్టీలోకి దూకేందుకే, హిందుత్వ ఎజెండాని విజయ సాయి రెడ్డి భుజానికెత్తుకున్నారా.?
లేదంటే, సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన జన సేనాని పవన్ కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకోవడానికి విజయ సాయి రెడ్డి నోట ఈ హిందుత్వ డైలాగులు వస్తున్నాయా.?
ఏది ఏమైతేనేం, మార్పు మంచిదే కదా.! హిందువులు గళం విప్పాల్సిన సందర్భమే ఇది.! ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది.!
కాకపోతే, ఈ మార్పు వెనుక కేవలం రాజకీయ కోణమే వుంటే, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే హిందుత్వ ఎజెండా అయితే, హిందూ ధర్మం అస్సలు క్షమించదు.
