Table of Contents
Vinaro Bhagyamu Vishnukatha Review.. యువ నటుడు కిరణ్ అబ్బవరం పేరు చెప్పగానే, ఆయన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’నే గుర్తుకొస్తుంటుంది.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తదితర సినిమాలు చేసినాగానీ, మొదటి సినిమాలోని ఆ సహజమైన నటన.. పక్కింటి కుర్రాడు.. ఇవే గుర్తుకొస్తాయ్ కిరణ్ అబ్బవరం గురించి ప్రస్తావిస్తే.
ఎందుకిలా.? అంటే, సినిమా సినిమాకీ తనను తాను మెరుగుపరచుకోవడంలేదేమో.! కానీ, మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. పెద్ద బ్యానర్లూ ఆయన వెంట పడుతున్నాయి.
తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. కాశ్మీరా పరదేశి హీరోయిన్. మురళీ శర్మ ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి.
Vinaro Bhagyamu Vishnukatha Review.. నైబర్ నంబర్.. కాన్సెప్ట్..
నైబర్ నెంబర్ కాన్సెప్ట్‌తో పరిచయమయ్యే ముగ్గురు వ్యక్తులు. అందులో ఒకరు మన హీరో. ఇంకొకరు హీరోయిన్. మూడో వ్యక్తి మురళీ శర్మ.
ఓ ప్రాంక్ వీడియో చేసే క్రమంలో మురళీ శర్మ చనిపోతాడు. ఆ కేసులో జైలుకు వెళుతుంది కాశ్మీరా పరదేశి. ఆమెను కాపాడేందుకు హీరో కిరణ్ అబ్బవరం చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు.. అదంతా మిగతా కథ.!
వినడానికి సింపుల్‌గానే వున్న ఈ కథలో.. చాలా అనవసరమైన విషయాలున్నాయి. అదే సినిమాకి ఇబ్బందికరంగా మారింది.
కిరణ్ అబ్బవరం.. కాస్త మారలయ్యా.!
కిరణ్ అబ్బవరం కొన్ని సీన్లలో చాలా బాగా చేస్తాడు. కొన్ని సీన్లలో తేలిపోతాడు. బలం తెలిసినప్పుడు.. బలహీనతలూ తెలిసినప్పుడు.. బలహీనతల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే జరగడంలేదు కిరణ్ విషయంలో.
కాశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) ఓకే. క్యూట్‌గా వుంది. మురళీ (Murali Sharma) శర్మ తన అనుభవాన్నంతా రంగరించాడు. మిగతా పాత్రలన్నీ మమ అనిపించాయంతే.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నీ బాగానే కుదిరాయని చెప్పక తప్పదు. ఎడిటింగ్ లోపాలంటే.. సాగతీతను కత్తిరించలేకపోవడమే.!
నిర్మాణపు విలువలు బావున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు.
కలగాపులగం చేసేశారంతే..
నైబర్ నంబర్ కాన్సెప్ట్‌తో ఓ సరదా లవ్ స్టోరీ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అని ప్లాన్ చేసుకుని వుంటే, కిరణ్ అబ్బవరం నెట్టుకొచ్చేసేవాడు. కాదు కాదు, సత్తా చాటేవాడే.
కానీ, ఇందులోకి ఫోర్స్‌డ్ యాక్షన్ వచ్చేసింది. దేశభక్తినీ లాగేశారు. ఏవేవో జరిగిపోతుంటాయి తెర మీద. ఫస్టాఫ్ ఓకే.. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది.. అని సరిపెట్టుకునేంతలోనే.. సెకెండాఫ్.. చికాకు కలిగిస్తుంది.
సినిమాల్లో లాజిక్కుల గురించి మాట్లాడుకోవడం అనవసరంగానీ.. మరీ లాజిక్ లెస్ సినిమాల్ని తెరకెక్కిస్తే ఎలా.?
Also Read: గురూజీ త్రివిక్రమ్ ‘మోసం’పై భక్తుడు ‘బండ్ల’ గణేష్ ట్వీటాస్త్రం!
మంచి టైటిల్ అయితే పెట్టుకున్నారు.. స్వార్ధం లేకుండా పక్కవాడికి సాయం చేయాలన్న మంచి విషయాన్ని కూడా చెప్పాలనుకున్నారు.. ఈ క్రమంలో అడ్డదారులు తొక్కేశారు. కథలో ఈ కలగాపులగం లేకుండా వుంటే బావుండేదేమో.!
యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. ఎందుకో ఈ మధ్య కిరణ్ అబ్బవరం, ఆ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి బొక్క బోర్లా పడుతున్నాడు.
ఓవరాల్‌గా చెప్పాలంటే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ని థియేటర్లలో భరించడం కష్టం.. ఓటీటీలో అయినా.. చాలా ఓపిక వుండాల్సిందే.!