Vinnu Maddipati ప్రతి శుక్రవారం ‘నెంబర్ వన్’ హీరో పేరు మారిపోతుందిక్కడ.!
చాలాకాలం క్రితం సూపర్ స్టార్ మహేష్‌బాబు చెప్పిన మాట ఇది. తెలుగు సినిమాకి చివరి నెంబర్ వన్ హీరో చిరంజీవి మాత్రమే.!
‘వన్ టూ టెన్’ ఇంకెవరూ వుండరు. ఆ తర్వాతే మేం.. అని నిర్మొహమాటంగా మహేష్‌బాబు చెప్పారు ఓ సందర్భంలో.
ఔను, ఇప్పుడు ప్రతి శుక్రవారం ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎవరు హీరో అన్నది తేలిపోతోంది. అలాగని, స్టార్ హీరోల స్థాయిని తగ్గించి మాట్లాడలేం. సినిమా ఈక్వేషన్స్ అలా మారాయ్ మరి.!
ఓ కిరణ్ అబ్బవరం.. ఓ నాని.. ఓ రవితేజ.. ఓ చిరంజీవి.! ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో ఇలా ఎదిగిన, ఎదుగుతున్నోళ్ళు చాలామందే వున్నారు.

ఓ ఫ్లాప్ చూశాం, ఇక చాలు.. అనుకుని, సినీ రంగాన్ని వదిలేస్తే.. రాబోయే సక్సెస్‌ని వదులుకున్నట్టవుతుందేమో.!
Vinnu Maddipati.. సినిమా.. ఓ ప్యాషన్.!
సినిమా అంటే ప్యాషన్ వుండాలి. అదే, సినీ రంగంలో జీవించడానికి సరైన ఆక్సిజన్. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా హిట్ వస్తుంది.
‘సినిమా.. సినిమా.. సినిమా.. ఇదే మాకు తెలుసు’ అనుకున్నోళ్లు ఏదో ఒక రోజు సినీ రంగంలో అత్యద్భుతమైన విజయాల్ని అందుకుంటారు.
‘గ్రంధాలయం’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. అందులో హీరోగా నటించిన యువ నటుడు విన్ను మద్దిపాటిని చూస్తే, అతన్ని కదిలిస్తే.. సినిమా పట్ల అతని ప్యాషన్ ఎలాంటిదో అర్థమవుతోంది. సినిమాపై ఖచ్చితమైన అభిమానం, ఆరాధనా భావం అతి కొద్ది మందిలోనే వుంటుంది.
దామోదర్ ప్రసాద్ లాంటి సినీ ప్రముఖుడు, ఏదో మొహమాటానికి విన్ను మద్దిపాటి సినిమా ‘గ్రంధాలయం’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి, నాలుగు మంచి మాటలు చెప్పారని ఎలా అనుకోగలం.?

నిర్మొహమాటంగా చాలా విషయాలు మాట్లాడారు దామోదర ప్రసాద్. ఆయన మాటల్లో, విన్ను మద్దిపాటి ఈ సినిమా కోసం ఎంత చిత్తశుద్ధితో, జెన్యూన్‌గా కష్టపడ్డాడో కనిపించింది చాలామందికి.
ఇటీవలి కాలంలో ప్రాచార ఆర్భాటాల్లో భాగంగా జనాన్ని పోగేసి మాటలు చెప్పించడాన్ని ప్రస్తావించిన దామోదర ప్రసాద్, ‘గ్రంధాలయం’ టీమ్‌కి జెన్యూన్‌గా వస్తున్న సపోర్ట్ ఆహ్వానించదగ్గదని అన్నారు.
వచ్చాం.. వెళ్ళిపోయాం.. అన్నట్టు కాదిక్కడ..
కాగా, విన్ను మద్దిపాటి మాట్లడుతున్నంతసేపూ, కేవలం ‘గ్రంధాలయం’ సినిమాపై ఆయన ఇష్టాన్ని మాత్రమే కాదు, మొత్తంగా సినీ పరిశ్రమ పట్ల, ఈ రంగంలో రాణించడం పట్ల ఆయనకున్న ప్యాషన్ కొట్టొచ్చినట్లు కనిపించింది.
వచ్చాం, వెళ్ళిపోయాం.. కాదు, వచ్చాం.. కొట్టి తీరతామన్న కసి విన్ను మద్దిపాటి మాటల్లో చాలామందికి అర్థమయ్యింది.
ముందే చెప్పుకున్నాం కదా.. ఓ నాని, ఓ రవితేజ, ఓ చిరంజీవి.. సినీ రంగంలోకి ప్యాషన్‌తోనే వచ్చారు.. సాధించారు.
Also Read: స్వామి శరణం: చరణ్ ఇండియాలో ఇలా!. అమెరికాలో అలా.!
ఓ శుక్రవారం తనదైతే చాలు, రాత్రికి రాత్రి విన్ను మద్దిపాటిని స్టార్‌ని చేసేస్తుంది సినిమా రంగం. ఇక్కడ కావాల్సింది కష్టపడటం. ఆ కష్టపడేతత్వం, సినిమా పట్ల ప్యాషన్.. టన్నుల్లో వుందంటున్నాడు విన్ను మద్దిపాటి.

‘గ్రంధాలయం’ ట్రైలర్ చూస్తేనే, విన్ను మద్దిపాటిలో నటుడిగా వున్న ఈజ్ ఏంటో అర్థమవుతోంది. మాస్ మెచ్చే లక్షణాలన్నీ వున్నాయ్ విన్ను మద్దిపాటిలో.
యాక్షన్ బ్లాక్స్‌లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్‌లో కనిపిస్తోంది. కంటెంట్ గనుక ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే, ‘గ్రంధాలయం’ గురించి పాజిటివ్ డిస్కషన్స్ అనూహ్యంగా వుంటాయ్.