Table of Contents
Virata Parvam Result.. ఏదన్నా సినిమా రిలీజవుతోందంటే చాలు, ముందుగా ఆ సినిమాపై నెగెటివిటీని బలవంతంగా రుద్దెయ్యాలి.! గత కొద్ది రోజులుగా ప్రతి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది.
‘విరాటపర్వం’ సినిమా కూడా ఇందుకు మినహాయింపేమీ కాకుండా పోయింది.
సాయి పల్లవి (Sai Pallavi), రానా దగ్గుబాటి (Rana Daggubati) జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలయ్యింది. సినిమా విడుదలకు ముందే, సినిమాపై విపరీతమైన నెగెటివిటీ క్రియేట్ అయ్యింది.
ఎందుకిలా.? సాయిపల్లవికి మామూలుగా అయితే నెగెటివిటీ వుండదు. ఆమె మంచి నటి. రానా దగ్గుబాటి సంగతి సరే సరి. అటు సాయి పల్లవిగానీ, ఇటు రానా దగ్గుబాటిగానీ, ఈ ఇద్దరూ వివాదాలకు దూరంగా వుండేవారే.!
Virata Parvam Result.. విరాట పర్వం పరిస్థితేంటి.?
కానీ, ఈసారి తేడా కొట్టింది. సాయి పల్లవి (Sai Pallavi) ఓ ఇంటర్వ్యూలో అనూహ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
మతం పేరుతో హింసని తప్పు పట్టే క్రమంలో సాయి పల్లవి, ‘కాశ్మీర్ పండిట్లపై హింస’ అంశాన్ని ప్రస్తావిస్తూ, దానికి ఇంకో అర్థం పర్థం లేని విషయంతో ముడిపెట్టి, ‘బోత్ ఆర్ సేమ్’ అన్నట్టు మాట్లాడింది.

దీంతో, బాయ్ కాట్ సాయి పల్లవి.. అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బాయ్ కాట్ విరాటపర్వం.. అని కూడా స్లోగన్స్ షురూ అయ్యాయి.
జస్ట్ పబ్లిసిటీ కోసమేనా.?
వాస్తవానికి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తెలివైనోడు. ఆయనెందుకు సాయి పల్లవితో, ఈ విషయమై క్షమాపణ చెప్పించలేదు.? వివరణ ఇప్పించలేదు.?
ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. సినిమా పబ్లిసిటీ కోసమే ఈ వివాదం తెరపైకొచ్చిందా.? అన్న అనుమానం కలగడం సహజమే.
పరిశ్రమ ఏమైపోవాలి.?
సరే, ఆ వివాదం సంగతి పక్కన పెడితే, సినిమా విడుదల కాకుండానే నెగెటివి ఏంటి.? ఇందుకే కదా, సినిమాలు సర్వనాశనమైపోతున్నది. పరిశ్రమ దెబ్బ తింటోన్నది.
Also Read: Hello Goodbye.. శ్రద్ధా శ్రీనాథ్ ఘాటైన ఆటిట్యూడ్.!
థియేటర్లు నడవకపోతే, సినిమాలు రాకపోతే.. ముందు ముందు ఎంతమంది సినీ పరిశ్రమను నమ్ముకున్నోళ్ళు ఉపాధి కోల్పోతారు.?
ప్చ్.! ఏమీ చెయ్యలేం. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’, ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘పుష్ప’.. ఇలా ఏ సినిమా కూడా ఈ నెగెటివిటీని తప్పించుకోలేకపోతోంది. ఇక, పరిశ్రమ ఈ నెగెటివిటీతో సావాసం చేయాల్సిందే.!