Virata Parvam Sai Pallavism.. సాయి పల్లవి మంచి నటి. కాదు కాదు, ఏ సినిమాలో ఆమె నటించినా.. అందులో ఆమె పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
అదే సాయి పల్లవి ప్రత్యేకత, పాత్రలో ఒదిగిపోవడంలో బహుశా సాయి పల్లవికి సాటి ఇంకెవరూ రారేమో.!
సాయి పల్లవి (Sai Pallavi) డాన్స్ చేస్తోంటే, డాన్స్ చేస్తున్నట్లుండదు.. డాన్స్‌ని ఆమె ఆస్వాదిస్తున్నట్లుంటుంది.. ఆమె డాన్స్‌ని ఆస్వాదిస్తూ, చూసేవాళ్ళూ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటారు. అదీ సాయి పల్లవి ప్రత్యేకత.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడమనేది కొందరికే సాధ్యమవుతుందేమో. ‘ఎక్స్‌ట్రాల’ జోలికి సాయి పల్లవి అస్సలు వెళ్ళదు. మేకప్ విషయంలోనూ సాయి పల్లవి అతి చేయదు.. చాలా చాలా సహజంగానే వుండాలనుకుంటుంది.

సరే, సాయి పల్లవి (Sai Pallavism) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిందేముంది.?
Virata Parvam Sai Pallavism ..అభిమాన సంద్రంలో సాయి పల్లవి.!
బోల్డంతమంది అభిమానులున్నా, సాయి పల్లవి ఆ అభిమానంలో తడిసి ముద్దయిపోతుంటుంది.. ఒక్కోసారి ఆ అభిమానుల అభిమానాన్ని చూసి, ఆనందంతో ఏడ్చేస్తుంటుంది కూడా.
ఇంతకీ, సాయి పల్లవి ఎక్కడ.? ‘విరాట పర్వం’ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఓ అభిమాని, నేరుగా ‘విరాట పర్వం’లో హీరోగా నటించిన రానా దగ్గుబాటినే అడిగేశాడు. ‘నేను కూడా సాయి పల్లవికి అభిమానినే.. ఆమె కోసం కర్నూలులో ఈవెంట్ ప్లాన్ చేశాం..’ అని చెప్పాడు రానా.
ఇదంతా, ‘విరాట పర్వం’ (Virata Parvam) సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియో అయినాగానీ, చాలా సహజంగా వచ్చింది.
ఈ ప్రమోషనల్ వీడియోపైనా సాయిపల్లవి తనదైన స్టయిల్లో స్పందించింది. ‘ఇక్కడ అంత సీన్ లేదండీ.. నేనే చాలా లక్కీ.. అభిమానులు చాలా చాలా మంచోళ్ళు.. వారు చూపించే ప్రమేకి నేనెప్పుడో ఫిదా అయిపోయాను..’ అంటూ చెప్పుకొచ్చింది.

ఆ జనాన్ని చూడటానికి తానే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని సాయి పల్లవి పేర్కొనడం గమనార్హం.
ఇదీ సాయి పల్లవిజం అంటే.!
ఇందుకే కదా, సాయి పల్లవిని పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) పోల్చుతుంటారు చాలామంది. లేడీ పవర్ స్టార్.. అని ఇప్పటికే సాయి పల్లవి (Lady Power Star Sai Pallavi) గుర్తింపు తెచ్చేసుకుంది.
Also Read: Amala Paul.. నిజమే.! అందమైన అయస్కాంతమే.!
తాజాగా, సాయి పల్లవిజం.. (Sai Pallavism) అంటూ సాయి పల్లవి అభిమానులు సరికొత్తగా ఓ ‘ఇజం’ అలవాటు చేసేసుకున్నట్టున్నారు.