Table of Contents
Sitara Ghattamaneni Song: సూపర్ స్టార్ కుమార్తె ఆమె.! అందుకే, ఆమెకు సంబంధించి ఓ ఫొటో బయటకు వచ్చినా ఆ ఫొటోకి విపరీతమైన క్రేజ్. అలాంటిది ఆమె నుంచి ఓ వీడియో వస్తే, వైరల్ అవకుండా వుంటుందా.?
తన స్నేహితురాలితో కలిసి చాలా చాలా చిన్నప్పటినుంచే సితార ఘట్టమనేని వీడియోలు చేస్తోంది.. ఓ యూ ట్యూబ్ ఛానల్ కూడా నడిపేస్తోంది.
సితార.. తండ్రికి తగ్గ తనయ.. తల్లికి తగ్గ తనయ కూడా.!
ఈసారి ఏకంగా ఓ సినిమాలోని ఓ పాటలో నటించేసింది.. అదీ తండ్రి సినిమాలో కావడం గమనార్హం. ఆమె ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార ఘట్టమనేని.
‘1 నేనొక్కడినే’ సినిమా గుర్తుందా.? అందులో చిన్నప్పటి మహేష్ పాత్రలో గౌతమ్ నటించేశాడు. మహేష్ తనయుడే గౌతమ్. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిపోనున్న తనయుడు.. అనేలా తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు గౌతమ్.
ఇప్పుడు సితార వంతు. తన తండ్రి మహేష్ (Super Star Maheshbabu) నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా కోసం అందులోని ఓ పాటలో కనిపించనుంది సితార.
‘పెన్నీ’ అంటూ సాగే ఈ పాట తాలూకు ప్రోమో, లిరికల్ వీడియో విడుదల చేశారు. జస్ట్ టాప్ క్లాస్.! ఔను, సితార చాలా కాన్ఫడెంట్‌గా చాలా ఈజ్‌తో చేసుకుంటూ పోయింది.
Sitara Ghattamaneni Song.. డాన్స్ అదరగొట్టేసిన సి‘తార’.!
వాట్ ఏ డాన్స్.! ఇదీ సితారని చూసినవాళ్ళంతా చెబుతున్నమాట. వెండితెరపై సితార ఎలా కనిపించబోతోంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఎందుకంటే, సినిమా ప్రమోషన్ కోసం వాడిన ఈ వీడియో.. సినిమాలో వుంటుందో లేదో చెప్పలేం. అసలు సినిమాలో సితారకి ఏదన్నా పాత్ర ఇచ్చారా.? అన్నదానిపైనా స్పష్టత లేదు.
అన్నట్టు, మహేష్ సోదరి మంజుల (Manjula Ghattamaneni) కూడా సినిమాల్లో నటించారు. ఆనాటి సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె కావడమే పెద్ద మైనస్ అయిపోయింది మంజులకి.
ఆమె సినిమాల్లో నటించడానికి వీల్లేదు.. హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకునేది లేదు.. అంటూ అభిమానులు నానా యాగీ చేశారు అప్పట్లో.
మేనత్త సాధించలేనిది సితార సాధిస్తుందా.?
అలా నటన మీద తనకున్న కోరికను బలవంతంగా పక్కన పెట్టాల్సి వచ్చింది మంజుల చాన్నాళ్ళు.
ఆ తర్వాత ఆమె నిర్మాతగా మారారు.. అఫ్‌కోర్స్ నటన మీద మమకారంతో ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి. కానీ, హీరోయిన్ అవ్వాలనుకున్న ఆమె అది మాత్రం సాధించలేకపోయారు.
Also Read: Janhvi Kapoor.. ఆ ఉద్దేశ్యం వుందో.! లేదో.!
సితార తల్లి నమ్రత (Namrata Shirodkar) హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించారు. మరి, ఆమె తన కుమార్తెను వెండితెరకు పరిచయం చేస్తారా.? మహేష్ ఆలోచనలేంటి.? ఏమో, ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ఇప్పటికైతే సితార.. ఒక్క పాటతోనే.. డాన్సింగ్ డాల్.. అనేంతలా పాపులారిటీ సంపాదించేసుకుంటోంది. దాన్ని కొనసాగించేలా ఆమె వెండితెరపైకి వస్తుందా.? నటిగా సత్తా చాటుతుందా.? వేచి చూడాల్సిందే.