Virupaksha Victory.. సీరియస్ టోన్ మూవీస్‌కి ఈ మధ్య ప్రేక్షకులు అంతగా ఎట్రాక్ట్ కావడం లేదు.
ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ వుండి, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా వుంటేనే ఆడియన్స్ ధియేటర్లకు వస్తున్నారు.
కానీ, ‘విరూపాక్ష’ (Virupaksha Movie) విషయంలో అది పూర్తిగా భిన్నం. ఈ సినిమాకి తిరుగులేని విజయం కట్టబెట్టారు ఆడియన్స్. ఓ సిరీయస్ హారర్ మూవీకి ఇంత క్రేజా.? అదీ ఈ రోజుల్లో.!
కొన్ని సినిమాలుంటాయ్.. అనూహ్యంగా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయ్.!
సినిమాకి సక్సెస్ ఫార్ములా.. అంటూ ఏదీ వుండదు.!
ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయితే.. ఆ సక్సెస్ వేరే లెవల్‌లో వుంటుందంతే.!
‘విరూపాక్ష’ టీమ్ కష్టపడింది.. కష్టానికి మించిన ఫలితాన్ని అందుకుంటోంది.!
వంద కోట్ల క్లబ్‌లోకి ‘విరూపాక్ష’ చేరితే.. సాయి ధరమ్ తేజ్‌కి అది వెరీ వెరీ స్పెషల్ మూమెంట్.!
Mudra369
అస్సలు ఎంటర్‌టైన్‌మెంట్ లేని సినిమా ఇది. రిలీజ్‌కి ముందు ఇదే టాక్ వచ్చింది. లవ్ స్టోరీ కూడా బాలేదన్నారు. సీరియస్ టోన్‌లో సాగే, పాత కాలం కథ.
Virupaksha Victory .. 100 కోట్ల దిశగా ‘విరూపాక్ష’ పరుగులు.!
అయినా కానీ, యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. హారర్ ఎలిమెంట్స్ వున్నప్పటికీ చిన్న పిల్లలు కూడా ఈ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు.
రిలీజ్‌కి ముందు టాక్ ఏమంత పాజిటివ్‌గా లేదు. రిలీజ్ తర్వాత కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయ్. అయినా సూపర్ డూపర్ హిట్ లిస్ట్‌లో చేరింది ‘విరూపాక్ష’.
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ‘విరూపాక్ష’. ఇప్పటికే 70 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
Also Read: జర్నలిస్టుకి గూబ గుయ్యిమనిపించిన సంయుక్త.!
రిలీజై రెండు వారాలు గడుస్తున్నా ఇంకా ‘విరూపాక్ష’ క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని ధియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు తారసపడుతున్నాయ్. ఓ సినిమాకి ఇంతకన్నా అసలు సిసలు విక్టరీ ఏముంటుంది.?
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.