Vishal Movie Telugu తెలుగువాడైనా, తమిళ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ పరిశ్రమలో అంచలంచెలుగా ఎదిగాడు. నటుడే కాదు, నిర్మాత కూడా.!
సినీ పరిశ్రమకు సంబందించిన సమస్యలపై తనదైన స్టయిల్లో స్పందించడమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. ఈ క్రమంలో వివాదాలనేవి సర్వసాధారణం.
ఆయనెవరో కాదు, హీరో విశాల్.! తమిళంతోపాటు తెలుగులోనూ తన సినిమాల్ని డబ్ చేసి వదులుతుంటాడు విశాల్. పబ్లిసిటీ విషయంలో అస్సలు తగ్గడు.
మార్కెట్ సంపాదించుకోవడం కంటే, దాన్ని కాపాడుకోవడం కష్టం.!
తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విశాల్ ఎందుకు ఆ మార్కెట్ కోల్పోతున్నట్లు.?
విశాల్ సినిమాలకి తెలుగులో వెన్నుపోటు పొడుస్తున్నదెవరు.?
గుడ్డిగా నమ్మి విశాల్ దెబ్బయిపోతున్నాడా.? పరాన్నజీవుల్ని విశాల్ గుర్తించలేకపోతున్నాడా.?
Mudra369
ఒకప్పుడు విశాల్ సినిమాలంటే, తెలుగులో మంచి మార్కెట్ వుండేది. ఏమయ్యిందోగానీ, విశాల్ సినిమాలకి తెలుగునాట మార్కెట్ దారుణంగా పడిపోయింది.
Vishal Movie Telugu.. వెన్నుపోటు పొడుస్తున్నదెవరు.?
మొన్నటికి మొన్న వచ్చిన ‘లాఠీ’ విషయంలో.. అదీ తెలుగు వెర్షన్ విషయంలో చాలా పెద్ద గ్యాంబ్లింగ్ జరిగింది. నిజానికి, ఆ సినిమాకి తెలుగులో ఇంకాస్త బెటర్ వసూళ్ళు వచ్చి వుండాలి.!

ఎవరో తెలుగునాట విశాల్‌ని తప్పుదోవ పట్టిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ వరకు విశాల్ ఎవర్ని నమ్మాడోగానీ, వాళ్ళయితే విశాల్‌ని నట్టేట్లో ముంచేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, విశాల్ ఇమేజ్‌తో ఆడుకున్నారు. ప్రమోషన్స్ దగ్గర్నుంచి, రిలీజ్ వరకు హైడ్రామా నడిచింది. ‘లాఠీ’ సినిమా ఎలాగో విడుదలైపోయిందిగానీ, అడ్రస్ గల్లంతయిపోయింది.
Also Read: Akhil Agent Trailer Review: ఏంటి అఖిల్ ఇలా చేశావ్.?
ఇప్పుడు విశాల్ కొత్త సినిమా విషయంలోనూ అదే టీమ్, తనదైన పైత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోందిట.
‘లాఠీ’ విషయంలో తిన్న దెబ్బ నేపథ్యంలో విశాల్ జాగ్రత్త పడితే మంచిదనీ, లేదంటే.. తెలుగులో పూర్తిగా మార్కెట్‌ని విశాల్ కోల్పోవాల్సి వస్తుందనీ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘లాఠీ’ తెలుగులో నష్టపోయిందిగానీ, విశాల్‌ని దెబ్బకొట్టినోళ్ళు మాత్రం ఆర్థికంగా బలపడ్డారట. ఇలాంటోళ్ళని పరాన్నజీవులు.. అంటే అది తప్పెలా అవుతుంది.?