Vishnupriya Subscription Glamour.. బుల్లితెర యాంకర్, డాన్సర్ కూడా.! అంతేనా, సినిమాల్లోనూ నటిస్తోంది.! మొన్నామధ్య బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలోనూ సందడి చేసింది.
తెలుగు బుల్లితెర వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరామెది. ఆమె ఎవరో కాదు, విష్ణుప్రియ. ఇంత ఇంట్రడక్షన్ అవసరమా.? అంటే, ఆమె చుట్టూ లొల్లి ఆ స్థాయిలో జరుగుతోంది మరి.
విష్ణుప్రియ నవ్వితే ఎంత వికారంగా వుంటుందో.. అనేంతలా, ఆమె నవ్వు మీద భయంకరమైన కామెంట్లు పలు టీవీ షోల్లో ఆమె వుండగానే పడిపోయాయ్. అదో రకం కామెడీ.
అసలు విషయమేంటంటే, ఇప్పుడు విష్ణుప్రియని అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు కొందరు. కారణం, ఆమె తన అర్థ నగ్న దృశ్యాలను అమ్ముకుంటోందిట సోషల్ మీడియా వేదికగా.
అదేంటీ, చాలామంది సెలబ్రిటీలు చేస్తున్నది అదే కదా.? కొన్ని సోషల్ మీడియా వేదికలు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఇస్తున్నాయి. వాటి ద్వారా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు క్యాష్ చేసుకోవచ్చు.
Vishnupriya Subscription Glamour.. కాదేదీ సబ్‌స్క్రిప్షన్‌కి అనర్హం..
కొందరు కామెడీ చేసి క్యాష్ చేసుకుంటారు.. ఇంకొందరు, గ్లామర్ చూపించి క్యాష్ చేసుకుంటారు. లైవ్ షోలు పెట్టి, క్యాష్ చేసుకునేవారి సంగతి సరే సరి.
ఈ మధ్యనే ఇండియాలో అడల్ట్ కంటెంట్ మీద బ్యాన్ విధించారు.. దాంతో, చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అడల్ట్ కంటెంట్ మాయమైపోయింది.
అర్థనగ్న దృశ్యాలు మాత్రం ఇంకా అలానే కొనసాగుతున్నాయ్. కేవలం విష్ణుప్రియ మీదనే, ఈ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయ్.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు.
Also Read: Chiraiya Web Series Review: ఇది ఆమె కథ.! కాదు, వ్యధ.!
ఫలానా సెలబ్రిటీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎంత సంపాదిస్తోందో తెలుసా.? అంటూ, ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కొందరు ఔత్సాహికులు తమకి తోచిన రీతిలో కామెంట్లు పాస్ చేసేస్తున్నారు.
ప్రతి నెలా లక్షల్లో సంపాదన.. అంటూ, విష్ణుప్రియ మీద ఈ మధ్య పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఈ క్రమంలో, కొందరు ఔత్సాహికులు, విష్ణుప్రియను అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
అరెస్టులు చేసుకుంటూ పోతే, చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ‘హాట్ కంటెంట్’ని ఆపేసుకోవాల్సి వస్తుంది. సాధ్యమయ్యే పనేనా అది.?
