Vishwak Sen Cult Director.. విషయం వున్నోడే.! కాకపోతే, ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తుంటాడు.! అదే అసలు సమస్య.!
సరే, కొన్ని వివాదాలు, సినిమాల పబ్లిసిటీకి పనికొస్తుంటాయ్.! ఆయా సందర్భాల్లో ఆయా వివాదాలే, సినిమాల్ని గట్టెక్కించేసిన సందర్భాలూ వుండొచ్చు.
సినిమా అంటేనే మ్యాజిక్.! సక్సెస్ ఫార్ములా తెలిస్తే, అసలంటూ ఫ్లాప్ సినిమాలే రావు కదా.! అదన్నమాట సంగతి.!
Vishwak Sen Cult Director.. దర్శకత్వం.. మూడోస్సారి.!
విశ్వక్ సేన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? మల్టీ టాలెంటెడ్. డాన్స్ బాగా చేస్తాడు, యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ అదరగొడతాడు.
అంతేనా, నటనతోపాటు దర్శకత్వం కూడా వచ్చు. స్వీయ నిర్మాణంలోనూ సినిమాలు చేయగలడు. తనంతట తానుగా సినీ పరిశ్రమలో ఎదిగాడు విశ్వక్ సేన్ (Vishwak Sen).

ఆల్రెడీ ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ తదితర సినిమాలకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. వాటిల్లో ‘ఫలక్‌నుమా దాస్’ పెద్ద హిట్. ‘దాస్ కా ధమ్కీ’ నిరాశపరిచింది.
‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్‌గా నటించింది. డబుల్ రోల్ చేశాడు విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో.
కల్ట్ డైరెక్టర్..
తాజాగా, తన దర్శకత్వంలో వివ్వక్ సేన్ (Vishwak Sen) ఇంకో సినిమా షురూ చేశాడు. సినిమా పేరు ‘కల్టర్’. ఈసారి స్పెషల్ ఏంటంటే, కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తాడట.
Also Read; HIT-3 Review: నాని చెప్పింది సగమే నిజం.!
ఈ ‘కల్ట్’ సినిమాకి నిర్మాత కూడా విశ్వక్ సేన్ కావడం గమనార్హం. సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు వచ్చి, దర్శక నిర్మాత విశ్వక్ సేన్‌కి విషెస్ అందించారు.
నటుడిగా వరుస ఫ్లాపుల నేపథ్యంలో, మొత్తంగా ట్రాక్ మార్చేసి.. దర్శకుడిగా ‘కల్ట్’ సినిమాని తెరకెక్కిస్తున్న విశ్వక్ సేన్, బౌన్స్ బ్యాక్ అవుతాడా.? అవ్వాలనే కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ‘కల్ట్’ విశ్వక్ సేన్.