Vishwaksen Funky Kayadu Lohar.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొన్నీమధ్యనే షాక్ తినేశాడు ‘లైలా’ సినిమాతో.! ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్‌తో ‘క్షమాపణ’ కూడా చెప్పాల్సి వచ్చింది.!
సరే, ఫ్లాప్ సినిమా చేశాక ‘క్షమాపణ’ చెప్పడం, హుందాతనమేననుకోండి.. అది వేరే విషయం.! హిట్టూ, ఫ్లాపు.. ఎవరికైనా సహజమే.! కాకపోతే, ఫ్లాపొచ్చాక ఆత్మవిమర్శ చేసుకోవడం కొందరికే సాధ్యం.
విశ్వక్ సేన్ తదుపరి చిత్రం అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
రీ-ఎంట్రీ అనుకోవచ్చా.?
తాజాగా ఈ సినిమా కోసం హీరోయిన్‌గా కాయదు లోహార్ పేరుని ఖారారు చేశారట చిత్ర దర్శక నిర్మాతలు. కాయదు లోహార్ అంటే, ఇటీవల ‘డ్రాగన్’ సినిమాలో నటించింది కదా ఆ బ్యూటీనే.!
కొన్నాళ్ళ క్రితం శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది కాయదు లోహార్. అంతకు ముందు ఓ కన్నడ సినిమాలో నటించిందామె.

కన్నడ, తెలుగుతోపాటు తమిళ అలాగే మలయాళ సినిమాల్లోనూ నటించిన ఈ అస్సాం బ్యూటీ, విశ్వక్ సేన్ సరసన హీరోయిన్‌గా ఎంపికవడం.. అది కూడా తెలుగులో ఆమెకు రీ-ఎంట్రీ కావడం విశేషమే.
కాగా, విశ్వక్ సేన్ – అనుదీప్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తారు.
‘లైలా’ అనుభవంతో, తన తదుపరి సినిమాల్లో అసభ్యతకు అస్సలు తావుండదని ఇటీవల విశ్వక్ సేన్ ‘క్షమాపణ’ లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.