Hyderabad Pubs And Drugs: బార్‌లో కూర్చొన్న ఓ వ్యక్తి.. తన స్నేహితుడికి ఫోన్ చేసి రమ్మని పిలిస్తే, ఆ స్నేహితుడు వచ్చాడు. కానీ, ఆ స్నేహితుడికి మద్యం తాగే అలవాటు లేదు.
ఓ స్ప్రైట్ బాటిల్ తెప్పించుకుని ఛీర్స్ చెబుతూ, స్నేహితుడు కంపెనీ ఇవ్వడంతో ఆ పార్టీ అలా అప్పటికి పూర్తయిపోయింది.
బార్ అయినా, పబ్ అయినా.. ఇలాంటివి చాలానే కనిపిస్తాయ్. పబ్బు కల్చర్ పెరిగాకా, పబ్బుల్లో పార్టీలు చేసుకోవడం పరమ రొటీన్ వ్యవహారం.
పబ్బుల్లో లిక్కర్ సర్వ సాధారణమైనా, పబ్బుకెళ్లి కూడా లిక్కరు తీసుకోనివాళ్లు చాలా మందే వుంటారు.
హైద్రాబాద్‌లో ఓ పబ్పుపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో, ఓ సినీ నటి సహా చాలా మంది బుక్కయ్యారు.
సుమారు 150 మంది ఆ సమయంలో ఆ పబ్బులో వున్నారు. అందర్నీ పోలీసులు, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Hyderabad Pubs And Drugs పబ్బుకెళితే నేరమా.? ఇదేం తీరు.?
పబ్బుకి వెళ్లడం నేరమా.? అన్న ప్రశ్న ఇక్కడే ఉత్పన్నమవుతుంది. డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారో తెలీదు. కానీ, అందర్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే అనుమానాస్పదం.
బర్త్‌డే పార్టీ కోసం ఫ్రెండ్ పిలిస్తే వెళ్లామని కొందరు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా పబ్బుకెళ్లామని ఇంకొందరు చెబుతున్నారు. ఈ లిస్టులో సినీ నటి, సినీ గాయకుడు తదితరులున్నారు.
సినిమాల్లో చిన్నాచితకా రోల్స్ చేసే ఓ షార్ట్ ఫిలిం నటి కూడా వుంది. ఆమెని ఇప్పుడు అంతా ‘బజ్జీపాపా’ అంటున్నారు.
‘పబ్బుకెళ్లాను.. కానీ, అక్కడ డ్రగ్స్ కానీ, మద్యం కానీ తీసుకోలేదు.. బజ్జీలు తినొచ్చాను..’ అని ఆమె చెప్పడమే, ఆమెకి ‘బజ్జీ పాప’ అని పేరు రావడానికి కారణమైంది.
తప్పేగానీ.. తప్పదంతే.!
ఇదిగో పులి.. అంటే, అదిగో తోక.. అనే నైజం జనాలది. అక్కడ పులీ వుండదు, తోకా వుండదు.
పబ్బుకెళ్లినోళ్లంతా నేరస్థులైతే, పబ్బులకు ఎందుకు అనుమతులొస్తున్నాయ్.? మధ్యపానం ఆరోగ్యానికి హానికరం.. కానీ, ప్రభుత్వాలకి ఆ మధ్యం ద్వారా వచ్చే ఆదాయం అంటే మహా ఇష్టం.
Also Read: Disha Patani అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చేశావే.!
పనీ పాటా లేని సన్నాసులంతా కలిసి సోషల్ మీడియాలో నోటికొచ్చిందల్లా వాగడం సర్వ సాధారణమైపోయింది. అలా వాగేవాళ్లలో ఎంత మంది తాగుబోతులున్నారో, ఎంత మంది డ్రగ్స్ కేటుగాళ్లున్నారో ఎవరు చెప్పగలరు.?
ఇది లిక్కర్ కానీ, డ్రగ్స్ కానీ, కనీసం సిగరెట్టు కానీ అలవాటు లేని ఓ సాధారణ పబ్ గోయర్ మాట.