Vishwaksen GOG Publicity Stunt.. విశ్వక్ సేన్ అంటేనే ‘అతి’.! సినిమా పబ్లిసిటీ కోసం ఏవేవో వేషాలు వేస్తుంటాడు. మంచి నటుడే. స్టామినాకి మించిన స్టార్‌డమ్ కూడా దక్కించుకున్నాడాయె.!
అయినా, ఎందుకు వివాదాలు.? వివాదాల్లేకపోతే, గుర్తింప ఎక్కడ.? దటీజ్ విశ్వక్ సేన్.!
అసలు విషయానికొస్తే, ‘బ్యాక్ గ్రౌండ్ లేకపోతే..’ అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్.
ఈ బ్యాక్‌గ్రౌండ్ గోలేంటి.?
‘బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా..
డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్,అ ట్టర్ ఫ్లాప్ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది.
తగ్గే కొద్దీ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై ఒట్టు. మహాకాళి మాతో వుంది.
డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే, ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు..’ అంటూ విశ్వక్ సేన్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఇంతకీ, విశ్వక్ సేన్ గేమ్ మారుద్దామని అనుకున్నదెవరు.? విశ్వక్ సేన్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదెవరు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!
ప్రతిసారీ పరమ రొటీన్.!
తన ప్రతి సినిమాకీ ఏదో రకంగా వివాదాలు రాజేసి, పబ్లిసిటీ పొందడం విశ్వక్ సేన్‌కి వెన్నతో పెట్టిన విద్య.
బహుశా ఈ పోస్ట్ కూడా వ్యూహాత్మకంగానే, పబ్లిసిటీ కోణంలోనే విశ్వక్ సేన్ పెట్టి వుండొచ్చు.
విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధమైంది. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్.