Waltair Veerayya Mega Hit.. మేమంతా సినీ కార్మికులం.. నిరంతర శ్రామికులం.. కళామతల్లి సైనికులం సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం!
తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ విడుదలయ్యాక, మెగాస్టార్ చిరంజీవి విజయోత్సాహంతో స్పందించిన తీరు ఇది.!
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. దీన్ని ‘థ్యాంక్స్’ నోట్‌గా చెప్పుకోవచ్చు.
మేమంతా సినీ కార్మికులం.. నిరంతర శ్రామికులం.. కళామతల్లి సైనికులం సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. మా గమ్యం.. మిమ్మల్ని అలరించటం!
Megastar Chiranjeevi
అంతే కాదు, సినిమా కోసం తామెంత కష్టపడుతున్నదీ నూట యాభైకి పైగా సినిమాల్లో నటించిన ‘చిరంజీవితాన్ని’ ఆయన ఆవిష్కరించానడం సబబేమో.!
దర్శకుడంటే ఎలా వుండాలి.?
‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవాన్ని మీడియా సాక్షిగా సినీ అభిమానులతో పంచుకున్న చిరంజీవి, సక్సెస్ మీట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడంటే, భారీ చిత్రం.. సూపర్ హిట్ కొట్టడం.. ఇవే కాదు, నిర్మాతకి అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయంలో సినిమా చేసి ఇవ్వడమే విజయానికి గుర్తుగా పెట్టుకోవాలంటూ చిరంజీవి ఓ సూచన చేశారు.
దాంతో, సహజంగానే అంతా దీన్ని కొరటాల శివ మీద కౌంటర్ ఎటాక్.. అంటూ తీసుకున్నారు. అయినా, కొరటాల శివ మీద చిరంజీవి ఎందుకు విమర్శలు చేస్తారు.?

‘నా సినిమా అయినా బాగోకపోతే, రెండో రోజే థియేటర్లకు రావడం మానేస్తున్నారు ప్రేక్షకులు..’ అని చిరంజీవి తన మీదే తాను సెటైర్లేసేసుకున్నారు.
Waltair Veerayya Mega Hit.. అనుభవం నేర్పిన పాఠం..
మారిన కాలానికి అనుగుణంగా మనమూ మారాలంటూ యంగ్ డైరెక్టర్స్‌కి చిరంజీవి దిశా నిర్దేశం చేస్తున్నారు.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
‘వాల్తేరు వీరయ్య’ సినిమాని ఓ కేస్ స్టడీలా తీసుకోమని చిరంజీవి చేసిన సూచనపైనా కొన్ని విమర్శలు వస్తున్నాయి.
‘ఇదేం సినిమా.? ముచ్చటగా మూడు రివ్యూలు కూడా పాజిటివ్ యాంగిల్‌లో లేవు..’ అన్నది కొందరి విమర్శ. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కూడా రెండున్నర రేటింగులు వేసిన ఘనత మన మీడియాది.
‘ఆచార్య’ కావొచ్చు, ‘వాల్తేరు వీరయ్య’ కావొచ్చు.. కంటెంట్ ఏంటి.? ఎంత కాలంలో తెరకెక్కింది.? అంచనాల్ని ఎలా అందుకుంది.? ఇలా చాలా లెక్కలుంటాయ్.
చిరంజీవి విమర్శించాలనుకుంటే, కొరటాల శివ పేరునే నేరుగా ప్రస్తావించగలరు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ, చిరంజీవి పేరు పెట్టి ఎవర్నీ విమర్శించరు. అసలాయన వ్యక్తిత్వమే అలాంటిది కాదు.
కొత్త తరం.. కొత్తగా సినిమాని మరింత ఉన్నతంగా వుంచాలని మాత్రమే చిరంజీవి కోరుకుంటారు. ఎందుకంటే, ఆయన సినీ కార్మికుడు.. శ్రామికుడు.. సైనికుడు.. ప్రేమికుడు.! మెగాస్టారుడు.! చిరంజీవుడు.!