అప్పట్లో మాస్, క్లాస్ అన్న తేడాలుండేవి కాదు. క్రమంగా మాస్, క్లాస్.. అన్న విభజనలు ప్రచారంలోకి వచ్చాయ్.! ఏ సెంటర్ అయినా మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi Waltair Veerayya) ఒకటే. అది చిరంజీవి శకం.!
అప్పటికీ, ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మేనియా అలాగే వుంది.. ఆ మాటకొస్తే ఇంకా ఇంకా పెరుగుతూ వస్తోందంతే.! ఒక్క సినిమా ఫ్లాప్‌తో పడిపోయే రేంజ్ కాదు మెగాస్టార్ చిరంజీవిది.
ఆ విషయం ‘ఆచార్య’ (Acharya) ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ (Godfather)తో ఇంకోసారి ప్రూవ్ అయ్యిందంతే.
మాస్ ‘గాడ్’ ఫాదర్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రాబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్రఈ చిత్రానికి దర్శకుడు.
చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ని ఖరారు చేస్తూ, చిత్ర యూనిట్ ఓ టీజర్ విడుదల చేసింది.
Waltair Veerayya మెగా మాస్ స్టైలింగ్..
మాస్ మూల విరాట్టు.. అని ఎందుకు ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ పేర్కొంటోందో, టైటిల్ టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది.
Also Read: నిజాయితీ, నిబద్ధత.! నిలువునా పాతరేసిన ‘గాడ్ ఫాదర్’.!
ఓ ‘ముఠామేస్త్రి’, ఓ ‘ఘరానా మొగుడు’, ఓ ‘గ్యాంగ్ లీడర్’.. ఇలా చిరంజీవిని చూసినోళ్ళందరికీ, ఆ కోవలోకే ‘వాల్తేరు వీరయ్య’ కూడా చెందుతాడనిపించకమానదు.
వయసు మీద పడుతున్నా.. ఆ మెగా స్టైలింగ్‌లో మాత్రం వన్నె తగ్గడంలేదు. దటీజ్ మాస్ మూల విరాట్టు మెగాస్టార్ చిరంజీవి.!