Table of Contents
Waltair Veerayya New Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం ‘వాల్తేరు వీరయ్య’ సగటు సినీ అభిమానికి పూనకాలు తెప్పిస్తోంది థియేటర్లలో.!
బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో సరికొత్త చిరంజీవిని చూశామంటూ కొందరు సినీ అభిమానులు చెబుతున్నారు.
కాదు కాదు.. వింటేజ్ చిరంజీవిని చూశామన్నది చాలామంది మాట.! ఇంతకీ, వింటేజ్ చిరంజీవి కనిపించారా.? కొత్త చిరంజీవిని చూస్తున్నామా.? వీటిల్లో ఏది నిజం.?
పాత చిరంజీవీ కాదు.. కొత్త చిరంజీవీ కాదు.. ఇది వేరే వెర్షన్.! మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’ అనుకోవాలేమో.! హైపర్ యాక్టివ్ మోడ్‌లో చిరంజీవి కనిపించి చాలాకాలం అయ్యింది.
Mudra369
నిజానికి, రెండూ రైటే.! తెరపై చిరంజీవిలో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదనడం బహుశా అతిశయోక్తి కాదేమో.!
Waltair Veerayya New Chiranjeevi.. కామెడీ కాదు.. టైమింగ్.. ఎనర్జీ.!
తెరపై మెగాస్టార్ చిరంజీవి మాస్ కామెడీ చేసేశారు. దాన్ని కామెడీ అనాలా.? టైమింగ్, ఎనర్జీతో కూడిన కామెడీ అనాలా.? ఏదైనా అనుకోండి.. థియేటర్లో ప్రేక్షకులైతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
అసలు చిరంజీవినేనా తాము తెరపై చూస్తున్నది.? అన్నంత అయోమయానికి గురైన ప్రేక్షకులు, ఇంకోసారి ఆ అయోమయానికి గురయ్యిందుకు ఇష్టంగా థియేటర్లకు వెళుతున్నారు.

స్క్రీన్ మీద కాస్సేపు మాస్ మహరాజ్ దడదడలాడించేశాడు. ఆ స్కోప్ రవితేజ పాత్రకు ఇవ్వడం.. అదీ మెగాస్టార్ సినిమాలో అంటే అది చిన్న విషయం ఏమీ కాదు.
రుణం తీర్చేసుకున్న రవితేజ..
‘అన్నయ్య అభిమానిని’ అని రవితేజ తరచూ చెబుతుంటాడు. ఆ అన్నయ్య రుణాన్ని ఇలా తీర్చేసుకున్నాడన్నది చాలామంది అభిప్రాయం. అందులోనూ నిజం లేకపోలేదు.
స్క్రీన్ మీద రవితేజ కాకుండా, ఆ పాత్రలో చిరంజీవి పక్కన ఇంకెవరు కనిపించినా అంత ఇంపాక్ట్ వుండేది కాదేమో.! అదీ నిజమే.
ఇక, డాన్సుల్లోనూ చిరంజీవి – రవితేజ అలా కనిపిస్తోంటే, పూనకాలు లోడింగ్ కాక ఇంకేమిటి.?
మెగాస్టార్ చిరంజీవి.. నయా వెర్షన్..
పాత చిరంజీవీ కాదు.. కొత్త చిరంజీవీ కాదు.. ఇది వేరే వెర్షన్.! మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’ అనుకోవాలేమో.! హైపర్ యాక్టివ్ మోడ్‌లో చిరంజీవి కనిపించి చాలాకాలం అయ్యింది.
Also Read: సినీ శ్రామికుడీ చిరంజీవుడు.! ‘మెగా’ తూటాలెవరిపై పేల్చాడు.?
150 ప్లస్ సినిమాలు చేసిన చిరంజీవి.. జయాపజయాలకు అతీతుడు. ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద విజయం అందుకుంటుంది ఫైనల్‌గా.. అన్నది వేరే చర్చ.
కానీ, ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవిలో కొత్త కోణాన్ని చూపించింది. కొత్త ‘మెగా’ వెర్షన్‌ని పరిచయం చేసింది. ఎనీ డౌట్స్.?