Table of Contents
Waltair Veerayya Poonakaalu.. అర్జంటుగా లుంగీ కట్టుకుని రోడ్ల మీద తిరిగెయ్యాలేమో.! ఔను, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూసిన చాలామందికి అలాగే అనిపించి వుండొచ్చు.!
‘ఘరానా మొగుడు’ నాటి చిరంజీవి గుర్తున్నాడా.? ‘రిక్షావోడు’ సినిమాలో చిరంజీవి మాస్ ఆటిట్యూడ్ మర్చిపోయారా.? ‘ముఠామేస్త్రి’ సినిమాలోని లుంగీ డాన్స్ సంగతేంటి.?
థియేటర్లలో ఐదు నుంచి పదేళ్ళ వయసున్న పిల్లలే కాదు, పదేళ్ళ పైబడిన పిల్లలు.. 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులూ కేరింతలు కొడుతోంటే.. ఇది కదా అసలు సిసలు పూనకాలు లోడింగ్.!
Mudra369
ఛత్.. ఇప్పుడెవడు చూస్తాడు అలాంటివన్నీ.! ఇలా కొందరు అనుకుని వుండొచ్చుగాక. ఆ కొందరే సోషల్ మీడియా వేదికగా ‘వాల్తేరు వీరయ్య’ మీద ట్రోలింగ్ చేశారు.
Waltair Veerayya Poonakaalu ఇదేం ట్రెండ్ మెగాస్టారూ..
‘చిరంజీవి ఇక మారడు. ఏం కామెడీ అది.? ఏ కాలంలో వున్నాడు.?’ అంటూ ఒకప్పటి చిరంజీవి అబిమానుల్లోనూ కొందరు ఈసడించుకున్నారు.
‘జంబలకిడి జారు మిటాయా..’ అని చిరంజీవి కామెడీ చేస్తోంటే, తలకాయ తీసుకెళ్ళి కుర్చీ కింద దాచేసుకున్నారు కొందరు చిరంజీవి అభిమానులుగా చెప్పుకుంటున్నోళ్ళు.. అదీ మొదటి రోజున.
కానీ, సీన్ మారిపోయింది. చిరంజీవి ఒక్కసారిగా తెలుగు సినిమా ట్రెండ్‌ని తన దార్లోకి తెచ్చేసుకున్నాడని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.
‘బాబీ నా అభిమాని అని చెప్పాడు.. ఈ కథ కూడా అలాగే చెప్పాడు. నా అభిమానిగా కాదు.. సగటు సినీ అభిమానిని అలరించేలా సినిమా చెయ్ అని చెప్పాను..’ అంటూ స్వయంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కష్టపడిందెవరు.? కష్టపెట్టిందెవరు.?
‘నేనేం కష్టపడ్డాను.? రవితేజ ఏం కష్టపడ్డాడు.? ఇతర నటీనటులు ఏం కష్టపడ్డాం.? మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నారు. టెక్నీషియన్లు కదా ఎక్కువ కష్టపడింది..’ అని సినిమా సక్సెస్ అయ్యాక క్రెడిట్ అంతా, టెక్నికల్ టీమ్‌కి, సినీ కార్మికులకీ చిరంజీవి ఇచ్చేశారు.

అంతేనా, దర్శకుడు బాబీ.. స్పెషల్ డైరెక్టర్.. అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ సినిమాని ఓ కేస్ స్టడీగా చూడాలని చిరంజీవి చెబితే, అది కొందరికి నచ్చలేదు.
‘మారాలయ్యా చిరంజీవీ’ అన్నారు. కానీ, తాను మారడం సంగతి తర్వాత.. ట్రెండ్‌ని మార్చేయగల దమ్మున్నోడు మెగాస్టార్.!
ట్రెండ్ సెట్టర్ మెగాస్టార్..
సుదీర్ఘకాలంగా సినిమాలు చేస్తున్న చిరంజీవికి తెలిసింది ఒక్కటే.. ట్రెండ్ సెట్ చెయ్యడం. డైలాగ్ తమ్ముడు పవన్ కళ్యాణ్‌దే అయినా.. ఆ ట్రెండ్ సెట్ చేసే దమ్మున్న బిగ్ బ్రదర్.. మెగాస్టార్ చిరంజీవి.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
థియేటర్లలో ఐదు నుంచి పదేళ్ళ వయసున్న పిల్లలే కాదు, పదేళ్ళ పైబడిన పిల్లలు.. 18 ఏళ్ళు నిండిన యువతీ యువకులు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులూ కేరింతలు కొడుతోంటే.. ఇది కదా అసలు సిసలు పూనకాలు లోడింగ్.!