Table of Contents
Waltair Veerayya Record మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ బంపర్ విక్టరీ కొట్టింది.
ఎవరూ ఊహించని విజయమిది. మెగాస్టార్ చిరంజీవి అసలు సిసలు స్టామినా ఏంటన్నది ఈ సినిమాతో నిరూపితమయ్యింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సరైన రేటింగులు ఇవ్వడానికి సోకాల్డ్ సినీ విమర్శకులకు మనసొప్పలేదు. చెత్త రివ్యూలతో సినిమాని తొలిరోజే చంపేద్దామనుకున్నారు.
చిత్రమేంటంటే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బ్రేక్ ఈవెన్ నెంబర్లు పెంచుకుంటూ వెళుతున్నారు కొందరు. నిన్న మొన్నటిదాకా అసలు బిజినెస్ సరిగ్గా జరగలేదన్నారు. ఇప్పుడేమో ఇలా.!
Mudra369
‘బాసూ.. లాసూ..’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. కానీ, ఏం జరిగిందిప్పుడు.?
Waltair Veerayya Record.. సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాలు చేశారు. కొన్ని ఫ్లాప్ సినిమాలూ ఆయన కెరీర్‌లో వున్నాయి.. తిరుగులేని విజయాలూ వున్నాయ్.!
టాలీవుడ్‌కి సంబంధించి వసూళ్ళ రారాజు మెగాస్టార్ చిరంజీవి. ఫ్లాప్ సినిమాలే కాదు.. డిజాస్టర్ సినిమాలతోనూ నిర్మాతలకు నష్టాలు రానివ్వలేదు చిరంజీవి.
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి. కానీ, ‘ఆచార్య’తో అన్నీ మారిపోయాయ్. ‘ఆచార్య’తో వచ్చిన వసూళ్ళ నష్టం కంటే, చిరంజీవి ఇమేజ్‌కి జరిగిన డ్యామేజీ చాలా చాలా ఎక్కువ.
సోషల్ నెగెటివిటీ..
చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే ఏంటో తెలియని నేటి జనరేషన్ మీడియా ప్రతినిథులు, చిరంజీవిని తూలనాడారు.. అదీ అత్యంత హేయంగా.

వాళ్ళకే ‘వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)’ విక్టరీ అస్సలు మింగుడు పడ్డంలేదు. ఇంకా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని ఫ్లాప్, డిజాస్టర్‌గానే చేస్తున్నారు.
ఓవర్సీస్‌లో ఆల్రెడీ సినిమా లాభాలబాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. చిరంజీవి ఊహించని విజయం కాదిది. చెప్పి మరీ కొట్టారు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో.
బ్రేక్ ఈవెన్ నంబర్లు పెంచేసుకుంటూ..
చిత్రమేంటంటే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి బ్రేక్ ఈవెన్ నెంబర్లు పెంచుకుంటూ వెళుతున్నారు కొందరు. నిన్న మొన్నటిదాకా అసలు బిజినెస్ సరిగ్గా జరగలేదన్నారు. ఇప్పుడేమో ఇలా.!
ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ 1.4 మిలియన్ల నుంచి 1.9కి పెంచేశారు. చిన్న విషయం కాదిది. 2 మిలియన్ల క్లబ్‌లో ఆల్రెడీ చేరిపోయింది ‘వాల్తేరు వీరయ్య’.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ: సంక్రాంతికి మెగా బాస్ పార్టీ.!
తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే. 50 కోట్లకు కూడా సినిమాని ఎవడూ కొనలేదన్నది గతంలో జరిగిన ప్రచారం. ఇప్పుడేమో, 100 కోట్లు.. ఆ పైన.. అంటూ బ్రేక్ ఈవెన్ నెంబర్లు చెబుతున్నారు.
బాస్ అంటే లాస్ కాదు.! బాస్ అంటే వసూళ్ళ గ్రేస్.! ఎవర్ గ్రీన్ మెగాస్టార్.!