Waltair Veerayya Review.. చిరంజీవి అంటే కామెడీ టైమింగ్‌కి కేరాఫ్ అడ్రస్.! చిరంజీవి అంటే డాన్సులు.!
చిరంజీవి అంటేనే మాస్.. ఊర మాస్.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? చిరంజీవిని ఇలా కంప్లీట్ కమర్షియల్ మాస్ యాంగిల్‌లో చూశాం.?
‘వాల్తేరు వీరయ్య’ ప్రోమోస్ ఒక్కోటీ వస్తోంటే, మెగాభిమానులే కాదు.. సగటు సినీ అభిమాని.. అందునా, మాస్ ఆడియన్స్ ఇలాగే అనుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన ‘బాబీ కొల్లి’ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘నన్నెలా ఓ అభిమానిగా తెరపై చూడాలనుకుంటున్నాడో.. ఆ అభిమానానికి తోడు, ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాడు..’ అంటూ చిరంజీవి ముందే చెప్పేశారు.
కాన్ఫడెంట్‌గా.. చాలా కాన్ఫిడెంట్‌గా చిరంజీవి ఈ సినిమా గురించి చెప్పారు. మరి, తన మాట నిజమని చిరంజీవి నిరూపించుకోగలిగారా.?
కథ ఇదీ..
కథేంటంటే, వీరయ్య ఓ మత్స్యకారుడు. స్కూలు పిల్లలు తినే ఐస్‌క్రీమ్‌లో డ్రగ్స్ కలవడానికి కారణం వీరయ్యేనంటూ పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు.

కానీ, దీనికి కారణం ఇంకో వ్యక్తి. అకారణంగా తాను అరెస్టయ్యానన్న ఆవేదన కంటే, పసిపిల్లలపై డ్రగ్స్ మహమ్మారి.. అన్న ఆవేదనతో, అసలు పని మొదలు పెడతాడు వాల్తేరు వీరయ్య.
నన్నెలా ఓ అభిమానిగా వెండితెరపై చూడాలనుకుంటున్నాడో.. ఆ అభిమానానికి తోడు, ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు బాబీ
Megastar Chiranjeevi
కథ ఏంటి.? అన్నది చెప్పేసుకున్నాం కదా.! మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ.. ఈ ఇద్దరి కారణంగా ‘పూనకాలు లోడింగ్’ ఏంటో తెలుసుకుందాం.
తెరపై చిరంజీవి అలా అలా కనిపిస్తోంటే, మెగాభిమానులకు నిజంగానే పూనకాలొచ్చేశాయ్. ఆ వయసేంటి.? ఆ ఎనర్జీ ఏంటి.? మాస్.. ఊర మాస్ మెగాస్టార్.
Waltair Veerayya Review.. బాస్ ఈజ్ బ్యాక్..
చిరంజీవి కామెడీ టైమింగ్ పవర్ ఏంటో ఇంకోసారి ఈ సినిమాతో బాబీ వెలికి తీసినట్లయ్యింది. ఈ విషయంలో బాబీకి ఫుల్ మార్క్స్. మెగాస్టార్ చిరంజీవి మేనరిజమ్స్‌ని బాగా క్యాప్చర్ చేశాడు. స్టైలింగ్ అదిరిపోయింది.
రవితేజ ఈ సినిమాకి అదనపు బలం. చిరంజీవి – రవితేజ మధ్యన సీన్స్ అలరిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, స్వల్పంగా సినిమా వేగాన్ని తగ్గిస్తాయి.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
అయితే రవితేజ – చిరంజీవి తెరపై కనిపించిన ప్రతిసారీ సగటు సినీ అభిమానికి అది కన్నుల పండగే. ఆన్ స్క్రీన్ ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ, అభిమానులకు మంచి అనుభూతినిస్తుంది.
శృతిహాసన్ తన వరకూ బాగా చేసింది. ప్రకాష్ రాజ్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. వెన్నెల కిషోర్ తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులు పూయించాడు.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్.. ఇలా వాట్ నాట్.. అన్ని విభాగాలూ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ చిరంజీవి విషయంలో. డాన్సులు, ఫైట్స్ విషయంలో.. చిరంజీవి ఎనర్జీ మాస్టర్ క్లాస్ అంతే.
ఓవరాల్‌గా ‘వాల్తేరు వీరయ్య’ పెర్‌ఫెక్ట్ సంక్రాంతి కమర్షియల్ ఎంటర్టైనర్.! నెగెటివిటీ అనే జాడ్యాన్ని మైండ్‌లోకి రానివ్వకుండా వింటేజ్ మెగా మాస్ మూల విరాట్టుని తెరపై ఎంజాయ్ చేసెయ్యండిక.!