Waltair Veerayya.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఓ దర్శకుడు రివ్యూ ఇచ్చాడట. అదే దర్శకుడు ‘వీర సింహా రెడ్డి’కి రివ్యూ ఇచ్చాడట.
రివ్యూ అంటే ఏదన్నా పర్సనల్ బ్లాగ్‌లో అనుకునేరు.! ఏ వెబ్‌సైటులోనో, పత్రికలోనో, న్యూస్ ఛానల్‌లోనూ ఆ రివ్యూ రాలేదు.!
విషయం వేరే వుంది. తొలుత ‘వీర సింహా రెడ్డి’ సినిమాని చూసిన ఆ దర్శకుడు, ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాడట.
ఓర్నీ.! నువ్వు కూడా వినాయక్ గురించి దుష్ప్రచారం చేసేంతటోడివా.?
Mudra369
‘సినిమా ఇలాగేనా తీసేది.?’ అంటూ ఆయా చిత్రాల దర్శకుల గురించి ఈ దర్శకుడు ఇంకొకరి వద్ద ఎగతాళి చేశాడట. దీన్ని సదరు దర్శకుడి ‘రివ్యూ’గా కొందరు పొరపడుతున్నారు.
Waltair Veerayya.. వినాయక్ ఎందుకు టార్గెట్ అయ్యాడు.?
దర్శకుడు వి.వి. వినాయక్ అత్యంత సౌమ్యుడు. తన పని ఏదో తాను చూసుకుంటాడంతే. అలాంటి వినాయక్ మీద ఇలాంటి గాసిప్ ఎందుకు పుట్టించారు.? అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్.
అటు నందమూరి బాలకృష్ణకీ, ఇటు మెగాస్టార్ చిరంజీవికీ వినాయక్ అత్యంత సన్నిహితుడైన దర్శకుడు. అంతే కాదు, ఇద్దరితోనూ సినిమాలు కూడా చేశాడు గతంలో.
ముందు ముందు మళ్ళీ దర్శకత్వం వహించే అవకాశమూ చిరంజీవి, బాలకృష్ణతో వినాయక్‌కి రావొచ్చు.. వస్తుంది కూడా.!
ఈ స్థాయికి దిగజారిపోయిందెవరు.?
‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీనిగానీ, ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) దర్శకుడు గోపీచంద్ మలినేనినిగానీ వినాయక్ విమర్శించే అవకాశమే వుండదు.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
వినాయక్ (Director VV Vinayak) గురించి తెలిసినవారెవరైనా ఈ మాట కుండబద్దలుగొట్టి చెబుతారు.
ఓర్నీ.! నువ్వు కూడా వినాయక్ గురించి దుష్ప్రచారం చేసేంతటోడివా.? అంటూ, సినీ జనం.. మాట్లాడుకుంటున్నారు గాసిప్ పుట్టించినోళ్ళ గురించి.

ఏనుగు అలా నడుచుకుంటూ వెళుతోంటే, బోల్డన్ని గ్రామ సింహాలు మొరుగుతాయ్. మొరగడమే వాటి పని.! ఇక్కడా జరుగుతున్నది అదే.! అంతకు మించి మాట్లాడుకోవడానికేముంది.?