పిల్లలూ.. మేడమ్ అనొద్దు.! సార్ అసలే అనొద్దు.!

Teacher Student Sir Madam
Madam Sir Teacher.. మేడమ్ కాస్తా మేమ్ అయిపోయింది.! సార్ సంగతి సరే సరి.! అసలంటూ స్కూళ్ళలో ఉపాధ్యాయుల పట్ల ఎంతమంది విద్యార్థులకు గౌరవం వుంది.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
‘మేం మా విద్యార్థుల్ని చూసి భయపడాల్సి వస్తోంది..’ అంటూ ఓ మాస్టారు ఆవేదన వ్యక్తం చేయడం స్వీయ అనుభవం.!
‘లెక్క ఎందుకు చేయలేదు.?’ అని సదరు మాస్టారు ప్రశ్నిస్తే, ‘నన్ను కూలం పేరుతో దూషించాడు’ అంటూ సదరు విద్యార్థి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టాడు.
తంతే తన్నించుకోవాలంతే.! తిడితే తిట్టించుకోవాలంతే, మూసుకుని పడాల్సిందే. తల్లిదండ్రులే పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నారన్నది నిష్టుర సత్యం.
Mudra369
చివరికి సదరు మాస్టారు, నోర్మూసుకోవాల్సి వచ్చింది. ఆ పిల్లాడికి అందరి ముందూ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
మరో సందర్భంలో, ఓ అమ్మాయి.. తనను మాస్టారు ‘టచ్’ చేశాడంటూ యాగీ చేస్తే, ఆ మాస్టారిదీ అదే పరిస్థితి.
Madam Sir Teacher సార్లు.. మేడమ్ములు.!
మేడమ్‌ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.! కుర్రగాళ్ళు, మేడమ్‌లకు ‘లైన్’ వేయడం, డబుల్ మీనింగ్‌లో తిట్టడం.. ఇవన్నీ సర్వసాధారణం.
ఇప్పుడిదంతా ఎందుకు.? అంటే, అసలు విషయం వేరే వుంది. కేరళ సర్కారు.. ఇకపై ‘మేడమ్’ అనొద్దు, ‘సార్’ అనొద్దు.. అంటూ ఆదేశాలు జారీ చేసింది.
మేడమ్ అయినా, సార్ అయినా.. ఎవర్నయినాగానీ, ‘టీచర్’ అనే సంబోదించాలట. బాగానే వుంది ఐడియా.!
స్త్రీ పురుషులిద్దరూ సమానమేగానీ..
కానీ, దీని వల్ల కొత్తగా వచ్చే మార్పు ఏంటి.? ‘స్త్రీ పురుషులిద్దరూ సమానమే.. అందుకే, ఆడ – మగ ఉపాధ్యాయుల్ని టీచర్‌గా మాత్రమే సంబోదించాలని చెబుతున్నాం’ అన్నది కేరళ ప్రభుత్వ వాదన.

మేడమ్, సార్, టీచర్, మాస్టార్.. ఎలా పిలిస్తేనేం.. ఉపాధ్యాయుల పట్ల విద్యార్థుల్లో గౌరవం పెరగాలి. కానీ, అది సాధ్మయ్యే పనేనా.?
పైన చెప్పుకున్న ఉదాహరణలు.. చాలామంది ‘టీచర్లకు’ అనుభవమే. కాదనగలరా.?
ఇంట్లోనే దారి తప్పుతున్నారు.?
అయినా, తల్లి దండ్రుల్ని.. మమ్మీ.. డాడూ.. అని నిర్లక్ష్యంగా పిలిచే, అత్యంత హేయంగా చూసే పిల్లలున్న రోజులివి.
‘మా బాబు చాలా కోపిష్టి.. కానీ, చాలా తెలివైనోడు తెలుసా.? మా అమ్మాయిని ఎవరూ ఏమీ అనకూడదు.. తల్లిదండ్రులమైన మేమైనా సరే.. ఏమీ అనం.. అంటే ఇంకేమన్నా వుందా.?’ లాంటి ఎచ్చులు నడుస్తున్నాయ్.
Also Read: జస్ట్ వైరల్: భార్యా బాధితుడీ కానిస్టేబుల్.! లీవ్ లెటర్ లీక్.!
తంతే తన్నించుకోవాలంతే.! తిడితే తిట్టించుకోవాలంతే, మూసుకుని పడాల్సిందే. తల్లిదండ్రులే పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నారన్నది నిష్టుర సత్యం.
పిల్లలదే కాదు, తల్లిదండ్రుల పెంపకంలోనూ తప్పులున్నాయ్.! ఇంట్లో సంస్కారం మొదలైతే, అది స్కూళ్ళలో ఇంకాస్త పెరుగుతుంది.
మీకర్థమౌతోందా.?
