Wamiqa Gabbi Modern Love.. పాత సినిమా వేరు, కొత్త సినిమా వేరు. పాత సినిమాల్లో ప్రేమ వేరు, కొత్త సినిమాల్లో ప్రేమ వేరు. అప్పటి ప్రేమకీ, ఇప్పటి ప్రేమకీ చాలా తేడా.
‘ఒసేయ్, ఒరేయ్..’ అనుకోవడం కొత్త ప్రేమ.! అంతేనా, అమ్మాయి – అబ్బాయి మధ్య ఒకప్పుడు ప్రేమ నడిస్తే, ఇప్పుడు సీన్ మారి.. అబ్బాయి – అబ్బాయి, అమ్మాయి- అమ్మాయి మధ్య ప్రేమ నడుస్తోంది.
కాలం మారింది కాబట్టే, దాంతోపాటూ ప్రేమ కూడా మారింది. ఇప్పుడీ కొత్త ప్రేమ గురించిన చర్చ ఎందుకంటే, వామికా గబ్బి అనే ఓ హీరోయిన్ గుర్తుందా.? ఆమె ‘మోడర్న్ లవ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది మరి.!
Wamiqa Gabbi Modern Love అసలేం జరుగుతోంది.?
ఇంతకీ మోడర్న్ లవ్ అంటే ఏంటి.? అని ప్రశ్నిస్తే, దానికి చాలా పెద్ద కథ వుందని అంటోంది ఈ బ్యూటీ.
తెలుగులో ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) అనే సినిమా చేసింది వామిక. సుధీర్ బాబు (Sudheer Babu) ఆ సినిమాలో హీరో. ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.

అయితే, హిందీ సహా పలు భాషల్లో చిన్నా చితకా సినిమాలు చేస్తోంది వామిక (Wamiqa Gabbi). వాటికి తోడు బుల్లితెరపైనా కనిపిస్తోంది. ఓటీటీలోనూ ఈ బ్యూటీ హవా బాగానే వుంది.
2019లో ఏకంగా నటనకు గుడ్ బై చెప్పేయాలనుకుందట వామిక గబ్బి. ఎందుకలా.? అనడిగితే, అన్నీ రొటీన్ పాత్రలే వస్తున్నాయనీ, అందుకే నటన నుంచి దూరమవుదామనుకున్నాననీ వామిక చెప్పింది.
నటన మీద అసహనం పెరిగిపోయిందట పాపం.!
సరిగ్గా ఆ సమయంలోనే కొత్త తరహా కథలు వామిక ముందుకొచ్చాయట.
అయితే, ‘ఎల్జీబీటీక్యూ ప్లస్’ కోణంలో కొత్త ప్రేమకథలు తన దగ్గరకు వస్తున్నాయనీ, సమాజమూ వాటిని ఆదరిస్తోందనీ చెప్పుకొచ్చిందీ తేనె కళ్ళ సుందరి.
ఓటీటీ కంటెంట్ అంటేనే, తేడా వ్యవహారాలనేంతగా చాలా వెబ్ సిరీస్లు ఆ కోణంలో వస్తున్నాయి. దానికి ‘మోడర్న్ లవ్’ అని పేరు పెట్టి, పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు మేకర్స్.!
Also Read: లక్కు తోక తొక్కిన సమంత.! ‘సుడి’ ఆ రేంజ్లో వుంది మరి.!
నిజమే, సమాజంలోనూ ఈ వింత పోకడ ఇటీవలి కాలంలో ఎక్కువైపోవడం వల్ల, ఆయా ఓటీటీ కంటెంట్స్కి విపరీతమైన క్రేజ్ అండ్ పాపులారిటీ దక్కుతోంది. అద్గదీ మోడ్రన్ లవ్ కహానీ.!