Table of Contents
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ‘సాహో’ (Saaho). ఈ ‘సాహో’కి సంబంధించి కొన్ని ‘షేడ్స్’ (Shades of Saaho) బయటకు రాబోతున్నాయి. అవేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు.. అంటే, అక్టోబర్ 23న ప్రభాస్ అభిమానుల కోసం ‘చాప్టర్ 1’ (Shades of Saaho Chapter 1) విడుదల కాబోతోంది. ఈ షేడ్స్ ఏంటి.? ఛాప్టర్స్ ఏంటి.? అనేదే కదా మీ డౌట్.!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఆమెకి తెలుగులో ఇదే తొలి సినిమా. ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘బాహబలి’ కారణంగా ప్రభాస్‌కి పెరిగిన ఇమేజ్‌తో, ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయిపోయింది. అనూహ్యంగా ఈ సినిమా తన రేంజ్‌ని పెంచుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్నే కాదు, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్నీ తుడిచిపెట్టేయనుంది.
దటీజ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prbhas)
‘బాహుబలి’ (Baahubali) సినిమా చేశాక, ప్రభాస్ ఎలాంటి సినిమా చేయాలి? అనే కన్‌ఫ్యూజన్ అభిమానుల్లో చాలా ఎక్కువగా ఉండడం సహజమే. అయితే, ఇచ్చిన మాటకు కట్టుబడి ‘రన్ రాజా రన్’ (Run Raja Run) అనే ఓ చిన్న సినిమా దర్శకుడితోనే ‘సాహో’ (Saaho) సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇదొక్కటి చాలు, ప్రభాస్ గొప్పతనమేంటో చెప్పడానికి. అయితే, అనూహ్యంగా ‘సాహో’ రేంజ్ పెరిగిపోయింది. ఎంతలా? అంటే, తొలుత ఈ సినిమాని తెలుగులో మాత్రమే చేయాలనుకోగా, అది బాలీవుడ్ స్థాయిని మించిపోయింది. అదీ రెబల్ స్టార్ ప్రభాస్ సత్తా అంటే.
తొలిసారి తెలుగులో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగులో తొలిసారి చేస్తున్న సినిమా ఇది. అయితే, కొన్నాళ్ళ క్రితం ఓ తెలుగు నటుడితో బాలీవుడ్‌లో ఓ పెద్ద సినిమా చేసింది ఈ బ్యూటీ. అదే ‘బాఘీ’ (Baaghie). ఇందులో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరో కాగా, మన టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) విలన్‌గా నటించాడు. ఆ సంగతి పక్కన పెడితే, ‘సాహో’ కోసం శ్రద్ధా కపూర్ కొంతమేర తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నించింది, కొంతవరకు సక్సెస్ అయ్యిందట కూడా. హీరోయిన్ అంటే గ్లామర్ కోసమే అన్నట్లుగా కాకుండా, ‘సాహో’ కోసం రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ శ్రద్ధా కపూర్ సత్తా చాటిందట.
ఇంతకీ షేడ్స్ ఆఫ్ సాహో అంటే ఏంటి.?
‘షేడ్స్ ఆఫ్ సాహో’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ద్వారా సినిమా ప్రచారాన్ని షురూ చేసింది ‘సాహో’ టీమ్. రేపట్నుంచి సినిమా పబ్లిసిటీ జోరందుకోనుంది. ప్రభాస్ (Prabhas Raju) లుక్‌తోపాటు ఓ టీజర్ లాంటిదొకటి రేపు రిలీజ్ అయ్యే అవకాశం వుంది. అయితే ఆ టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయా.? ఇంకేమైనా వుంటాయా.? అనేది తెలియరాలేదు. కొద్ది గంటలే కదా, ఆ సస్పెన్స్‌కి తెరపడేదాకా.. ఆ మాత్రం టెన్షన్ తట్టుకోగలరు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు.
చాప్టర్స్ సంగతేంటి గురూ!
చాప్టర్స్ అంటే, విడతల వారీగా సినిమా పబ్లిసిటీ చేయడం కావొచ్చు. దీని గురించి సినీ పరిశ్రమలో భిన్నమైన కథనాలు విన్పిస్తున్నాయి. రేపు ఉదయం చాప్టర్ 1 (Shades of Saaho Chapter 1) విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్ ‘పైసా వసూల్’ సినిమాకి స్టంపర్ అన్నాడు.. మరో సినిమా కోసం ‘ఇంపాక్ట్’ అనే పదాన్ని వాడారు. అలాంటిదే ఈ ‘చాప్టర్’ అవుతుందా? ఏమో, ఇప్పటికైతే ఈ సస్పెన్స్‌కి ఏమాత్రం తెరపడేలా లేదు. అంత పకడ్బందీగా సినిమాని ప్లాన్ చేశారన్నమాట.
ప్రభాస్ అభిమానులు మాత్రం, షేడ్స్ ఆఫ్ సాహో (Saaho) గురించీ, చాప్టర్ అనే మాట గురించీ రకరకాల ఊహాగానాలు చేసేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ ప్రభాస్ షేడ్స్ ఆఫ్ సాహో ఏంటో, ఆ షేడ్స్ ఆఫ్ సాహో తాలూకు చాప్టర్స్ ఏంటో.!