Why Not YS Jagan.. మ్యాజిక్ మార్క్ దాటితే చాలు, రప్పా రప్పా.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, 2029 ఎన్నికల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
గతంలో ‘వై నాట్ 175’ నినాదం తమనెంతగా దెబ్బతీసిందో వైసీపీ శ్రేణులకు బాగా తెలుసు. 2024 ఎన్నికలకు ముందర, వైఎస్ జగన్ స్వయంగా ఇచ్చిన నినాదం ఇది.
కుప్పం.. వై నాట్.! మంగళగిరి.. వై నాట్.! పిఠాపురం.. వై నాట్.! ఇదీ ఓ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా. అదీ, ముఖ్యమంత్రి హోదాలో.!
అప్పటికే, వైసీపీ సర్వనాశనమైపోయిందనే చర్చ అంతటా జరిగింది. కానీ, పార్టీ శ్రేణుల్ని మభ్యపెట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్, ‘వై నాట్ 175’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
Why Not YS Jagan.. వైనాట్ సకల శాఖల సజ్జల..
ఆ ‘వై నాట్ 175’ నినాదం సృష్టికర్త ఎవరో కాదు, అప్పట్లో సకల శాఖల మంత్రి.. అనే గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి.
భలే వుంది ‘వై నాట్ 175’ అనే నినాదం.. అనుకున్నారట వైఎస్ జగన్. ముందూ వెనుకా చూడకుండా, పార్టీ శ్రేణుల మీద జగన్, ా నినాదాన్ని రుద్దేశారు.

కట్ చేస్తే, కుప్పంలో వైసీపీ గెలవలేదు.. మంగళగిరిలోనూ వైసీపీ గెలవలేదు. పిఠాపురంలో కూడా వైసీపీ గెలవలేకపోయింది.! వైసీపీ గెలిచింది జస్ట్ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే.
ఇప్పటికన్నా వైసీపీలో ఆత్మ విమర్శ జరిగిందా.? అంటే, లేదాయె.! వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరిగితే, 200కి పైగా సీట్లలో వైసీపీ గెలిచేస్తుందని సజ్జల సెలవిచ్చారు.
ఒకవేళ సీట్లు పెరగకుంటే, 151 కంటే ఎక్కువ సీట్లలో గెలిచేస్తామని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సెలవిచ్చారు.! దాంతో, వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నాయి.
అసెంబ్లీకి వెళ్ళడానికే మొహం చెల్లట్లేదుగానీ..
వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వెళ్ళడానికే భయపడుతున్నారు.. వైఎస్ జగన్ సహా.! రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వైసీపీ అనుకోలేకపోతోంది.
ప్రజల్లో వుంటే కదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేదొకటుందని ఆ ప్రజలు గుర్తించేది.? ప్రజలకు దూరంగా, ‘వై నాట్’ అనే గాలి మాటలకు దగ్గరగా వుంటే, వైసీపీకి అసలు భవిష్యత్తే వుండదు.
ఓడిపోయాక ఎటూ, ‘మా ఓటర్లు వేరే వున్నారు’ అని చేతులు దులిపేసుకోవడం సజ్జల రామకృష్ణా రెడ్డికి అలవాటే. ఎందుకంటే, ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్ ఆయనకి లేదు.
వైఎస్ జగన్ అలా కాదు కదా.! ‘వై నాట్ టూ హండ్రెడ్ ప్లసూ..’ అనే నినాదాల్ని సజ్జల ఇకనైనా పక్కన పెడితే మంచిది.!
