కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవంతే. అలాంటి ప్రశ్నల్లో ‘డయాబెటిస్‌కి వ్యాక్సిన్ ఎందుకు రాలేదు.?’ అన్నది కూడా ఒకటి కావొచ్చు. నిజానికి, డయాబెటిస్ వస్తే.. చచ్చేదాకా మందులు వాడాల్సిందే. తొలుత ట్యాబ్లెట్లు, అదుపు తప్పితే ఇన్సులిన్ ఇంజెక్షన్లు.. ఇదీ డయాబెటిస్ (Why There Is No Medicine To Cure Diabetes) కథ.
కరోనా వైరస్ ఇలా ప్రపంచాన్ని చుట్టుముట్టేసిందో లేదో అలా వ్యాక్సిన్ గురించిన చర్చ షురూ అయ్యింది. వైరస్ బారిన పడ్డవారికి ఇంతవరకు ఖచ్చితమైన మెడిసిన్ ఏదీ ఇవ్వడంలేదు వైద్యులు. అసలంటూ మెడిసిన్ కనుగొంటే కదా.? అందుకే, వ్యాక్సిన్ రంగంలోకి దిగింది. అత్యవసర వినియోగం కిందనే ప్రపపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మీద పోరాటం కోసం వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరవుతున్నాయి.
నిజానికి, కరోనా కథ కొత్తది. డయాబెటిస్ కథ ఇప్పటిది కాదు. ఎన్నో దశాబ్దాల నాటి సమస్య. అలాంటప్పుడు, డయాబెటిస్ కోసం సరైన మందు ఎందుకు కనుగొనలేకపోయారు.? వ్యాక్సిన్ ఎందుకు తీసుకురాలేకపోయారు.? అంటే, వైద్య విజ్ఞానంలో మానవుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడన్నమాట. ఇదీ ఇప్పుడు చాలామంది తెరపైకి తెస్తున్న ప్రశ్న.
ఔను కదా.? అన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ జరుగుతోంది. డయాబెటిస్ వ్యాధి అనేది ఓ వ్యాపార సూత్రం అంటారు కొందరు. వీరమాచినేని రామకృష్ణ అనే డైట్ ఎక్స్పర్ట్ అలాంటివారిలో ఒకరు. రిఫైన్డ్ ఆయిల్ సహా చాలా అంశాలపై ఈయన తనదైన వాదనను వినిపిస్తుంటారు. కీటో డైట్.. తరహాలో తనదైన ఓ డైట్ ఫార్ములాతో చాలా వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని చెబుతుంటారాయన.
సరే, ఎవరి వాదన వారిది. డయాబెటిస్.. ప్రపంచమంతా వున్న సమస్యే. ఆ వ్యాధి రాకుండా చేయడానికి వ్యాక్సిన్ కనుగొనబడుతుందా.? డయాబెటిస్ వచ్చినవారికి జీవితాంతం మెడిసిన్స్ వాడే అవసరం లేకుండా వైద్య చికిత్స ఏమైనా అందుబాటులోకి వస్తుందా.? ఆ దిశగా పరిశోధనలు మొదలవ్వాలి.
ఔను, డయాబెటిస్.. అతి ఖరీదైన జబ్బు.. సామాన్యుల్ని ఆర్థికంగా చిదిమేస్తోన్న సమస్య (Why There Is No Medicine To Cure Diabetes) ఇది. కార్పొరేట్ మెడికల్ అండ్ హెల్త్ మాఫియాకి కాసుల పంట పండిస్తోన్న రోగమిది. ఈ రోగానికి ఖచ్చితంగా మందుని కనుగొనాల్సిందే.