Table of Contents
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాల్ని చవిచూశారు. సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోవడం తనకు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు (Will Chandrababu Bag Power Again) తరచూ చెబుతుండడం చూశాం, చూస్తూనే వున్నాం. కానీ, ఈసారి సంక్షోభం చాలా చాలా పెద్దది. చంద్రబాబు సైతం ఊహించనంత పెద్దది.
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు (CBN) అతి పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం (United Andhra Pradesh) రెండుగా విడిపోవడం, బీజేపీతో జతకట్టడం.. ఇవి చంద్రబాబుకి బాగా కలిసొచ్చాయి. దాంతో, చంద్రబాబు 13 జిల్లాల ఆంధ్రపదేశ్ (Andhra Pradesh)రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవగలిగారు.
సంక్షోభం మాత్రమే కనిపిస్తోంది.. అవకాశాలెక్కడ.?
నిజానికి, 2014 ఎన్నికలకు పదేళ్ళ ముందు.. అంటే, 2004 సమయంలో చంద్రబాబు ఎదుర్కొన్నది చాలా పెద్ద సంక్షోభం. అప్పట్లో కాంగ్రెస్ దెబ్బకు చంద్రబాబు కుదేలయ్యారు. ఆ దెబ్బ నుంచి తేరుకోవడానికి చంద్రబాబుకి పదేళ్ళు పట్టింది. కానీ, ఇప్పుడు కూడా పదేళ్ళు చంద్రబాబు ఎదురు చూడాల్సి వస్తే ఎలా.?
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్ ‘గేర్’ మార్చాల్సిందే.!
పెరుగుతున్న వయసు చంద్రబాబుకి (TDP Chief Nara Chandrababu Naidu) అతి పెద్ద సవాల్‌గా మారుతోందన్నది నిర్వివాదాంశం. తనయుడు నారా లోకేష్ (Nara Lokesh), పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నా, అవేవీ సత్ఫలితాలనివ్వడంలేదు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party In Telangana) చంద్రబాబు దాదాపు మర్చిపోయినట్లే. అదే పరిస్థితి ఆంధ్రపదేశ్‌లో కూడా వస్తే.?
అద్భుతం జరిగితే తప్ప.. కథ ముగిసినట్లే..
టీడీపీ అధినేత చంద్రబాబు (Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) తిరిగి పుంజుకోవడం ఖాయమని హార్డ్‌కోర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. కానీ, పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడంలేదు. 2014 ఎన్నికల్లో లభించిన అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కొత్త నాయకత్వాన్ని ఆయన టీడీపీలో తయారుచేసుకోలేకపోయారు.
Also Read: Prashant Kishor.. రాజకీయాల్ని మార్చేసిన ‘వ్యూహకర్త’
సంక్షోభం.. చంద్రబాబుకి సంబంధించినంతవరకు ఇది మహా సంక్షోభమే. అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబుగానీ, టీడీపీగానీ (Will Chandrababu Bag Power Again) తిరిగి పుంజుకునే అవకాశాలే సమీప భవిష్యత్తులో కనిపించడంలేదు.