ఆమె కన్ను కొడితే, ప్రపంచమే ఫిదా అయిపోయింది. ఆమె కన్ను కొట్టుడు మహిమ అలాంటిది. మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ’ఒరు అదార్ లవ్’ అను సినిమాలో నటించింది. నటిగా ఆమెకు అది తొలి సినిమా. సినిమా ప్లాప్ అయినా, ఆ సినిమాలో ఓ సన్నివేశం కోసం కన్ను కొడితే (Wink Beauty Priya Prakash Varrier), అదే ఆమెను స్టార్‌ని చేసింది. దేశంలో ఏ హీరోయిన్‌కీ రానంత గుర్తింపు రాత్రికి రాత్రి ప్రియా ప్రకాష్ వారియర్ దక్కించుకుంది.
తొలి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ, అడపా దడపా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ అనే గుర్తింపు ఆమెకు మళ్లీ మళ్లీ పాపులారిటీ తెచ్చిపెడుతూనే ఉంది. అలా ఆమె తెలుగులో నెమ్మది నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటోంది.
హీరోయిన్‌గా సరైన సక్సెస్ ఎప్పుడు.? అని అడిగితే, అనుకోకుండా తనకు కన్నుకొట్టడంతో గుర్తింపు వచ్చినట్లే, హీరోయిన్‌గా సక్సెస్ కూడా అలాగే వస్తుందంటూ తేల్చి చెప్పేసిందీ వింక్ బ్యూటీ.
ఇదిలా ఉంటే, డాన్సులు, యాక్షన్.. అలాగే వివిధ భాషలు మాట్లాడడం నేర్చుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ భామ. సినిమా పరిశ్రమలో అవకాశం రావడం ఓ మ్యాజిక్ అయితే, సక్సెస్ కొట్టడం ఇంకో మ్యాజిక్ అని ప్రియా ప్రకాష్ వారియర్ అభిప్రాయపడింది. హీరోయిన్‌గా ఇంకా కెరీర్ బిగినింగ్‌లోనే ఉన్నాను కనుక, కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి ప్రత్యేకంగా తానేమీ సలహాలు ఇవ్వలేనని చెప్పింది.
కన్ను కొట్టడంతో బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వచ్చాయనీ, ఇప్పుడు ఆ స్థాయిలో ఎక్కడా అవకాశాలు దక్కడం లేదనీ, అనుకోకుండా వచ్చే పాపులారిటీ వల్ల కలిగే దుష్ర్పభావాలు తానూ ఫేస్ చేశాననీ మనసులో మాట బయట పెట్టింది.
తెలుగు సినిమాకి కమర్షియల్ లెక్కలుంటాయనీ, మలయాళ సినిమాకి ఆ లెక్కలు చాలా తక్కువగా ఉంటాయనీ ప్రియా ప్రకాష్ వారియర్ అభిప్రాయపడింది. తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాలోనూ, తేజ సజ్జా సరసన ‘ఇష్క్’ సినిమాలోనూ ప్రియ ప్రకాష్ వారియర్ (Wink Beauty Priya Prakash Varrier) నటించింది.