Table of Contents
Wood Apple Health Benefits.. వెలగ పండు పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది వినాయక చవితి. బొజ్జ గణపయ్యకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగా వెలగ పండును అభివర్ణిస్తారు.
వెలగ పండు లేదా వుడ్ యాపిల్ అని పిలిచే ఈ పండును ఎలిఫెంట్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ పండును ఎంతమంది ఇష్టపడేవాళ్లున్నారు.?
చాలా తక్కువ మంది. కానీ, ఈ పండులోని ఆరోగ్య గుణాలు తెలిస్తే అందరూ ఇష్టపడాల్సిందే మరి. కాస్త పుల్లగా, వగరుగా.. అక్కడక్కడా చిరు తీపి తగిలే ఈ పండును అనేక రకాలుగా తినొచ్చు.
Wood Apple Health Benefits.. రోజూ కాకపోయినా సీజన్‌లో ఒక్కసారైనా.!
ఆయుర్వేదంలో వెలగ పండుకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఇక, ఈ పండును రోజూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కానీ, రోజూ తినడం సాధ్యపడకపోయినప్పటికీ సీజన్‌లో అయినా తప్పక తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఈ వెలగ పండు (Wood Apple) కు మెండుగా వుంది.
అలాగే, అనవసరమైన అలసట, నీరసం, రక్త హీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాంతులు, విరేచనాల వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
అల్సర్, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వెలగ పండు (Wood Apple) ను తరచూ తినడం వల్ల మటు మాయమవుతాయట.
క్యాన్సర్‌ని నిరోధించే మందుల తయారీలో వెలగ పండును వాడడం విశేషం.
స్త్రీలలో ‘ఆ’ సమస్యలు రాకుండా.!
ముఖ్యంగా స్త్రీలు ఈ పండును క్రమం తప్పకుండా తింటే, గర్భాశయ క్యాన్సర్‌తో పాటూ, వివిధ రకాల రుతుక్రమ సమస్యలకీ మంచి పరిష్కారం అందిస్తుందని అంటున్నారు.
బీపీ, షుగర్ వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడేవారు వెలగ పండును తింటే అవి అదుపులో వుంటాయ్ అట.

మరీ ముఖ్యంగా డయాబెటిస్‌తో (మధుమేహంతో) బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంగా చెబుతున్నారు.
శరీరంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచి అనవసరమైన బ్యాక్టీరియాని శరీరం నుంచి బయటికి పంపించడంలో వెలగ పండు (Wood Apple) లోని విటమిన్లు, మినరల్స్ చక్కగా తోడ్పడతాయ్.
ఎలా తినాలంటే.!
బాగా పండిన వెలగ పండు (Wood Apple)ను పెంకు తీసి కాస్త చక్కెర కానీ, బెల్లం కానీ కలిపి తినొచ్చు. అలాగే బెల్లం కలిపి జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు.
Also Read: Nutmeg Jajikaya.. జాజికాయ ఆరోగ్యకరమే.! కానీ, జర జాగ్రత్త.!
కాస్త పచ్చిగా వున్న వెలగపండును పచ్చడిగా చేసి తినొచ్చు. ఎలా తీసుకున్నా.. వెలగపండులోని ఆరోగ్య గుణాలు శరీరానికి మెండుగా అందుతాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.!
అందుకే ప్రతీ రోజూ కాకపోయినా.. సీజన్‌లో కనీసం ఒక్కసారైనా ఈ పండును తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.