కరోనా తెచ్చిన కష్టంగా కొందరు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంశాన్ని చూస్తోంటే, ఇంకొందరు దీన్ని ఓ వరంగా భావిస్తున్నారు. నిజానికి, కోవిడ్ 19 (కరోనా వైరస్) పాండమిక్ కంటే ముందే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home To Become Permanent Working Style) కొందరికి అమలవుతూ వస్తోంది. కార్యాలయ నిర్వహణ ఖర్చులు తగ్గడం సహా చాలా లాభాలున్నాయి కంపెనీలకి తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా.
తాత్కాలికంగా మాత్రమే కాదు, శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం కావాలనుకుంటే, అలాక్కూడా ఇబ్బందేమీ లేదని ఫేస్ బుక్ సంస్థ తాజాగా వెల్లడించింది తమ ఉద్యోగులకు సంబంధించి. స్వదేశాలకు వెళ్ళాలనుకునే ఉద్యోగులకు తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని పేర్కొనడం గమనార్హం.
Also Read: పర్యావరణ పరిరక్షణ: ప్రకృతికి మనం ఏమిస్తున్నాం.?
‘ఎక్కడి నుంచి పని చేస్తున్నారన్నది ముఖ్యం కాదు.. ఎలా, ఎంత పని చేస్తున్నారన్నదే ముఖ్యం. ఇంటి నుంచే సమర్థవంతమైన పనితీరు ప్రదర్శించేవారికి అక్కడి నుంచే శాశ్వతంగా పనిచేసుకునే అవకాశం కల్పిస్తే తప్పేంటి.?’ అన్నది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాదన.
ప్రపంచం మారింది.. సమావేశాలు కూడా జూమ్ ద్వారా జరిగిపోతున్నాయి. అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతున్నప్పుడు, ప్రత్యక్షంగా ఆఫీసులకు రావడం ఎందుకు దండగ.? అన్నది మెజార్టీ అభిప్రాయం.
Also Read: వందేళ్ళూ బతికేద్దాం.. వీలైతే ఇంకో పాతికేళ్ళూ.!
అయితే, ఇంటి వద్దనే వుండిపోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల నెత్తిన మానసిక ఒత్తిడి అధికంగా పడే అవకాశం లేకపోలేదు. నెట్వర్క్ సమస్యలు సహా, వ్యక్తిగత సమస్యలు ఉద్యోగులకు తలనొప్పులు తెచ్చిపెడితే, ఆ ప్రభావం ఖచ్చితంగా వారు చేసే వర్క్ మీద పడుతుంది.
ఇంటి వద్దనే కదా.. (Work From Home To Become Permanent Working Style) అని ఎక్కువ సమయం పని కోసం కేటాయిస్తే, శరీరానికి తగిన వ్యాయామం వుండదు. అది కొత్త సమస్యలకు కారణమవుతుంది. నాణానికి రెండు వైపులు.. అన్నట్టు, ప్రతి విషయంలోనూ మంచీ చెడూ వుంటాయి. చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలిగితే, చెడు.. అన్న మాటకే ఆస్కారం వుండదు.