Work On Weekdays.. వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి వస్తే ఎంత కష్టమో కదా. అందుకే వారంలో ఒకరోజు సెలవు దినం. సాఫ్ట్ వేర్ రంగం ఊపందుకున్నాకా, వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు నాలుగున్నర రోజులకు తగ్గించేస్తే.!
కరోనా దెబ్బకి వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటయ్యాకా, వారంలో ఎన్ని రోజులు పని చేస్తున్నామో తెలియని పరిస్థితి. ఆఫీసులకు అసలు వెళతామా.? లేదా.? అన్న గందరగోళం కొనసాగుతోంది.
Work On Weekdays తగ్గించారు.. మరి, పెరుగుతుందా.?
సరిగ్గా ఈ సమయంలో యుఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగున్నర రోజులు పని చేస్తే సరిపోతుందట. సాధారణంగా యూఏఈలో శుక్ర, శని వారాల్ని వీకెండ్‌గా పరిగణిస్తారు. అయితే, ఇకపై అక్కడ శని, ఆది వారాలు వీకెండ్‌లు అవుతాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సెలవు. అంటే, హాఫ్ డే అన్నమాట. మొత్తంగా వారంలో నాలుగున్నర రోజులే పని దినాలు.

అన్నట్టు, శుక్రవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్.. అలాగే, అనుకూలించిన సమయంలో పని చేసేలా కూడా వెసులుబాటు కల్పిస్తారక్కడ. స్కీమ్ అదిరింది కదూ.
తగ్గుట పెరుగుట కొరకేనట
వారంలో ఏడు రోజులూ చేసినా అదే పని. ఆరు రోజులు చేసినా అదే పని. ఐదు రోజులు, నాలుగున్నర రోజులు చేసినా అదే పని. ఎందుకంటే, ఒక వ్యక్తి తన సామర్ధ్యానికి మించి పని చేయడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. అందుకే, వారంలో నాలుగు, లేదా ఐదు రోజులు పని చేస్తే మంచి అవుట్ పుట్ ఓ ఉద్యోగి నుంచి రాబట్టవచ్చని అంతర్జాతీయంగా జరిగిన పలు సర్వేలలో వెల్లడయ్యింది.
Also Read: అమ్మో ఒకటో తారీఖు.. అయిపోద్ది బతుకు బస్టాండు
బాస్.. దుర్మార్గుడయితే, వారంలో ఏడు రోజులూ నరక యాతనే. ఫైనల్ అవుట్ పుట్ ఛండాలంగా తయారవుతుంది. అదే, బాస్ మంచోడైతే ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు, ఎంత మెరుగైన అవుట్ పుట్ వచ్చిందన్నదే ముఖ్యమవుతుంది. మంచి బాస్ ఆలోచనలు, కమిట్మెంట్‌తో పని చేసే ఉద్యోగులు.. ఈ తక్కువ పని గంటలకే (Work On Weekdays) జై కొడతారు.