Yashika Anand.. గ్లామర్ ప్రపంచంలో ఆడింది, పాడింది. భవిష్యత్‌ని చాలా అందంగా ఊహించుకుంది. పేరు, ప్రఖ్యాతలు వస్తున్న సమయంలో ఓ అనూహ్యమైన ఘటన.. ఆమె జీవితాన్ని అయోమయంలో పడేసింది. అసలు ప్రాణం ఉంటేనే కదా.. భవిష్యత్ గురించి ఆలోచించేది.
అవును, ఆమె చావును చూసింది. తన స్నేహితురాలి చావులో తన మరణాన్ని చూసుకుని జీవచ్చవంలా ఉండిపోయింది. లేవలేని పరిస్థితి. తీవ్రగాయాలతో కొస ప్రాణంతో ఆసుపత్రిలో చేరింది. బోలెడన్ని సర్జరీలు జరిగాయ్. ఎలాగైతేనేం, ఆమె బతికింది.
మంచం మీదే చాన్నాళ్లు ఉండిపోవల్సి వచ్చింది. ఇక, లేచి నడవడం అసాధ్యం అన్నంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. సంకల్ప బలం ఆమెని మళ్లీ నిలబెట్టింది. తన కాళ్ల మీద తాను నిల్చొని నడవడానికి రోజుల తరబడి నరక యాతన అనుభవించింది. చివరికి, గెలిచింది.
ఔను, Yashika Anand గెలిచింది..
పరిచయం అక్కర్లేని ఆమె ఎవరో కాదు, యాషికా ఆనంద్. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందే సోషల్ మీడియాలో అభిమానులనుద్దేశించి ఆసక్తికరమైన పోస్టులు పెట్టింది. ఇంటికెళ్లాకా, అభిమానులతో సోషల్ మీడియా వేదికగా టచ్‌లోనే ఉంది.

కాస్త కుదుట పడగానే, బయటకొచ్చింది కూడా. అదీ ఓ హెయిర్ సెలూన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కావడం విశేషం. చేతి కర్ర సాయంతో వ్యక్తిగత సిబ్బంది సాయంతో ఆమె అలా నడుస్తోంటే, చూసేవారి కళ్లు చెమర్చాయ్.
Also Read: Pooja Hegde, Kajal Aggarwal..కైపెక్కిస్తున్న చక్కని ‘చుక్క’లు.!
‘ఇప్పుడు ఇలా నడవగల్గుతున్నాను.. ముందు ముందు డాన్సులు కూడా చేస్తాను.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు భయం వేసింది. కానీ, మనోధైర్యమే నన్ను ముందుకు నడిపింది. వైద్యులు నాకు పునర్జన్మనిచ్చారు. కానీ, ఒకటే లోటు. నా స్నేహితురాలిని కోల్పోయాను..’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పింది యాషికా ఆనంద్ (Yashika Anand).