Yashoda Samantha Ruth Prabhu.. సమంతకి ఏమయ్యింది.? అన్న ప్రశ్న ఆమె తాజా సినిమా ‘యశోద’ ప్రోమో రావడంతోనే వైరల్ అయ్యింది.
సమంత అంటేనే కమిట్మెంట్, డెడికేషన్ వంటి వాటికి కేరాఫ్ అడ్రస్. ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏ స్థాయిలో కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఆ స్పెషల్ ఐటమ్ నెంబర్ మరింత స్పెషల్ అయ్యింది.
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ చేసినా, ‘కెఆర్‌కె’ సినిమాలో నటించినా.. సమంత (Samantha Ruth Prabhu) ఏం చేసినా సంచలనమే. హిట్టూ, ఫ్లాపూ.. అన్న విషయాల్ని పక్కన పెడితే, నటిగా సమంత ఎప్పుడూ ఫెయిల్ అవలేదు.
అలాంటి సమంత నుంచి ‘యశోద’ (Yashoda Cinema) పేరుతో ఓ సినిమా రాబోతోంది. తెలుగు, తమిళ సహా పలు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.
Yashoda Samantha Ruth Prabhu.. ‘యశోద’లో ఆ మిస్టరీ ఏంటబ్బా.?
‘యశోద’ నుంచి తాజాగా ఓ గ్లింప్స్ వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీద నుంచి సమంత లేచి ముందుకు వెళుతుంది. కిటికీ తెరిచి, అక్కడున్న పావురాన్ని తాకబోతుంది.. ఇంతే ఈ ప్రోమోలో కన్పించిన అంశం.
కానీ, మణిశర్మ సంగీతం, సమంత బాడీ లాంగ్వేజ్, సినిమాటోగ్రఫీ.. అవన్నీ, ‘యశోద’ (Yashoda Film) గ్లింపక్స్‌కి స్టన్నింగ్ అప్లాజ్ వచ్చేలా చేశాయి.
Also Read: Pooja Hegde పనైపోయిందా.? ఇక అంతేనా.?
ఇంతకీ, ‘యశోద’ మిస్టరీ ఏంటి.? ఇప్పుడిదే టాపిక్. ఎవరి అంచనాలకూ అందని రీతిలో హై ఓల్టేజ్ థ్రిల్లర్‌గా ఈ ‘యశోద’ని తెరకెక్కించారట. మిస్టరీ ఓ చిన్నారికి సంబంధించి.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పావురాన్ని ‘యశోద’ (Yashoda Movie) గ్లింప్స్‌లో చూపించారు గనుక, అది స్వేచ్ఛకీ.. స్వచ్ఛతకీ ప్రతీక గనుక.. సమంతని ఎవరు బంధీగా చేశారు.? అన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.