యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేననే డిమాండ్ ఇంకోసారి గట్టిగా తెరపైకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్ళడంతో, ఆయన్ని టీడీపీ శ్రేణులు ఎన్టీయార్ విషయమై (Young Tiger NTR And TDP Politics) నిలదీసినంత పనిచేశారు.
‘ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీయార్‌ని తీసుకురావాలి..’ అంటూ టీడీపీ (Telugu Desam Party) కార్యకర్తలు డిమాండ్ చేసేసరికి, చంద్రబాబు (Chandrababu) ఒకింత ఉలిక్కిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాట వాస్తవం.
తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) స్థాపించిన పార్టీ కోసం తాను పని చేయడం చాలా గర్వంగా వుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. అయితే, ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీతో (TDP) పెద్దగా సంబంధాలు కొనసాగించలేదు.
పార్టీలో కీలక బాధ్యతల్ని నారా చంద్రబాబునాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కి అప్పగించుకున్నారు. బావమరిది బాలయ్యకు (Nandamuri Balakrishna) వియ్యంకుడి హోదా ఇవ్వడమే కాదు, పార్టీ తరఫున హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు.. బాలయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా.
ఇంకోపక్క, నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) కుమార్తెను తెలంగాణలో పోటీ చేయించిన చంద్రబాబు, ఆమె గెలిపించలేకపోయారు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కావొచ్చు, జూనియర్ ఎన్టీయార్ (Young Tiger NTR And TDP Politics) కావొచ్చు ఎన్నికల ప్రచారానికి రాలేదు. సినిమా వేరు, రాజకీయం వేరు.
ఈ రోజుల్లో రాజకీయాల్లోకి సినీ నటులు వస్తే, ఆ తర్వాత జరిగే దుష్ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. పైగా, ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయి.. వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడిన దరిమిలా, ఓ చోట సెంటిమెంట్లు ఇంకోచోట తలనొప్పులుగా మారే అవకాశం వుంది.
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీయార్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంకా అతనికి కెరీర్ పరంగా చాలా భవిష్యత్తు వుంది. ఇప్పుడే ఆయన్ని రాజకీయాల్లోకి లాగనుకోవడం కూడా సబబు కాదేమో. రాజకీయాలపై (Young Tiger NTR And TDP Politics) ఆసక్తి కలిగితే, యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ఆపడం ఎవరి తరమూ కాకపోవచ్చు.