Table of Contents
Ys Jaagan Uchitha Salaha.. రాజకీయాలన్నాక, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు సహజమే. కాకపోతే, అవి హద్దులు దాటితే, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవుతుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, 2024 ఎన్నికల్లో జరిగింది ఇదే.! జన సేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ జగన్ ‘అతి’, వైసీపీ కొంప ముంచింది.
లేకపోతే, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ, 20204 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడమేంటి.? 11 సీట్లకు పడిపోయాక కూడా, వైసీపీలో ఆత్మ విమర్శ జరగలేదు.
Ys Jaagan Uchitha Salaha.. వైసీపీని ఓడించింది పవన్ కళ్యాణ్ మాత్రమే..
‘గుర్తు పెట్టుకో జగన్.. నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు..’ అంటూ, జనసేనాని శపథం చేశారు. మాట నిలబెట్టుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ జగన్, పదే పదే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మల్ని బహిరంగ సభల్లో పెట్టించి, వైసీపీ కార్యకర్తలతో కొట్టించారు.
అంతకు ముందెప్పుడూ, దేశ రాజకీయాల్లో ఇలాంటి ఛండాలన్ని ఎవరూ చూడలేదు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై జగన్ చేసిన రాజకీయ విమర్శలు, వైసీపీని పాతాళానికి తొక్కేశాయి.
ఆత్మ విమర్శ ఎప్పుడు.?
2024 ఎన్నికల తర్వాత, నేరుగా పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ ‘వ్యక్తిగత దూషణలతో’ విమర్శించింది లేదు. ఇది కొంతవరకు ఆహ్వానించదగ్గ విషయమే.
కానీ, వైసీపీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలు చేస్తున్నదేంటి.? ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతోందని అనుకోవాలా.?
శతృవుకి శతృవు మిత్రుడు.. అన్న కోణంలో, ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు, టీడీపీకి మద్దతిస్తున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
నిజానికి, వైసీపీ కాస్తో కూస్తో మంచి చేసుకోవాల్సింది జనసేన కార్యకర్తల్ని.. జనసేన అధినేతని. అప్పుడే, ఈక్వేషన్ వైసీపీకి అనుకూలంగా మారుతుంది.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు వుండరు..
అంతిమంగా ప్రజా సేవ కోసమే ఎవరైనా రాజకీయాలు చేసేది. అలాంటప్పుడు, రాజకీయ ప్రత్యర్థులుంటారుగానీ, శతృవులు వుండకూడదు ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ పార్టీకైనా.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఈక్వేషన్ అర్థం చేసుకున్న రోజున, వైసీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం వుంటుంది. లేదూ, ఇదే పంథా కొనసాగిస్తామంటే.. అంతే సంగతులు.!
చివరగా.. జనసేన పార్టీని వైసీపీ దగ్గర చేసుకోకపోయినా ఫర్లేదు, ఇగ్నోర్ చేసినా వైసీపీకి అది లాభమే.!
