Ys Jagan Assembly Gate.. పులివెందుల నియోజకవర్గ ప్రజలు, తమ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు.!
ఎమ్మెల్యే అంటే తెలుసు కదా.. శాసన సభ్యుడు.! అలాంటప్పుడు, శాసన సభ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరు కాకపోతే ఎలా.?
ఈ మాత్రం విజ్ఞత వుంటే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం నిమిత్తం, అసెంబ్లీ సమావేశాలకు హాజరయి వుండేవారే.!
Ys Jagan Assembly Gate.. గెలిపించిన పులివెందుల ప్రజల పరిస్థితేంటి.?
రాజకీయాలు, రాజకీయ విమర్శలు.. ఇది వేరే చర్చ. ఎమ్మెల్యేగా తన బాధ్యతల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వర్తించకపోతే, పులివెందుల ప్రజల పరిస్థితేంటి.?
‘మాకు ఈ ఎమ్మెల్యే వద్దు..’ అని పులివెందుల ప్రజలు ఈసడించుకునే పరిస్థితి రాకూడదు. అది జగన్ మోహన్ రెడ్డికి అస్సలు మంచిది కాదు.
ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఐదేళ్ళపాటు, అడ్డగోలుగా రాజకీయ విమర్శలు చేశాం.. ఆ విమర్శలకు ఇప్పుడు కౌంటర్ ఎటాక్ వస్తుంది.
గేటు తాకాలంటే భయం..
కాబట్టి, అసెంబ్లీ గేటు తాకాలంటే భయమేస్తుందన్న కోణంలో అసెంబ్లీకి వెళ్ళకూడదని జగన్ నిర్ణయించుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. కానీ, ఆ విమర్శల స్థాయిని ఏనాడో దిగజార్చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీలోనూ, రాజకీయ ప్రత్యర్థుల పెళ్ళిళ్ళ గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.
మరి, ఆనాటి ఆ పాపాలకి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా.! అద్గదీ అసలు భయం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి.. అని వైఎస్ జగన్ అనడం, కేవలం ‘కుంటి సాకు’ మాత్రమే.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’పై ‘నీలి’ కుట్రలు షురూ.!
అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకీ మాట్లాడే హక్కు వుంటుంది. అలా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ అసెంబ్లీలో మాట్లాడేందుకు హక్కుని కలిగి వున్నారు. ఆ హక్కుని సద్వినియోగం చేసుకోకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది.
భయపడి అసెంబ్లీకి వెళ్ళకపోతే, ‘ఇంత పిరికోడివి, నీకెందుకు రాజకీయాలు.?’ అని రాష్ట్ర ప్రజానీకం లైట్ తీసుకునే పరిస్థితి రావొచ్చు. పులివెందుల ప్రజలూ మార్పుని కోరుకునే పరిస్థితి రావొచ్చు.