Table of Contents
YS Jagan Bhayam Balaheenata.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థికి విజయావకాశాలు సుస్పష్టం.
కానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మామూలే. పోటీ వుండాలి.. వుంటేనే ‘కిక్కు’ వస్తుంది.!
ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు నిలబడతారు.?
YS Jagan Bhayam Balaheenata.. ఇబ్బందులు.. రాజకీయ బలహీనతలు..
ఇంకెటువైపు.. ఎన్డీయే కూటమి వైపు ఆయన నిలబడాల్సిందే.. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే, ఆయనకంటూ కొన్ని ఇబ్బందులున్నాయి.
‘ఇండియా కూటమి’ తరఫున, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తనకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ, వైసీపీ అధినేతను కోరారు.
ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడినట్లు వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ‘మద్దతివ్వలేకపోతున్నట్లు’ జగన్ తేల్చి చెప్పేశారట.
ఇదేమి సిత్తరం.?
చిత్రమేంటంటే, ‘వ్యక్తిగతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల అపార గౌరవం వుంది. ఆయన సేవలు దేశానికి అవసరం’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారట.
రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విశేష కృషి చేశారనీ వైఎస్ జగన్ కొనియాడేశారట.
ఎక్కడ అన్నారో, ఎవరితో అన్నారో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తెలియాలి.
‘జస్టిస్ సుదర్శన్ రెడ్డి సేవలు దేశానికి అవసరం’ అని వైఎస్ జగన్ చెప్పింది నిజమే అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓటు వేయాల్సింది, జస్టిస్ సుదర్శన్ రెడ్డికే కదా.?
ఈవీఎం ట్యాంపరింగ్.. ఓట్ చోరీ..
పైగా, దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయిందనీ, రాష్ట్రంలో వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికీ ఈవీఎం ట్యాంపరింగే కారణమని వైసీపీ ఆరోపిస్తోందాయె.
అలాంటప్పుడు, ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైసీపీ ఎలా మద్దిస్తోందో ఏమో.! కాంగ్రెస్ సహా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, ఈవీఎం ట్యాంపరింగ్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: శ్రీకృష్ణుడి వెన్నముద్ద.! చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.!
ఆ లెక్కన, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికే వైసీపీ మద్దతిచ్చి వుండాలి. కానీ, ఇవ్వదు. ఎందుకంటే, బీజేపీ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని భయాలు, బలహీనతలు వున్నాయి.
ఎన్డీయే కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.