తూనీగా.! తప్పు కదా.! అడ్డు తప్పుకో.!

 తూనీగా.! తప్పు కదా.! అడ్డు తప్పుకో.!

Ananya Panday

Ananya Panday Tooneega.. అనన్యా పాండే అందంపై తూనీగ మనసు పడినట్లుంది.! చూస్తున్నారుగా.. ఎలా అడ్డుగా అలుముకుందో.. ఆ అడ్డు తప్పుకోమంటున్నారు నెటిజనం.

అనన్యా అందాల్ని ఏరి పార చూడాలంటే.. తప్పదు తూనీగా అడ్డు తప్పుకోవల్సిందే.! అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫ్యాషన్‌లో అనన్య పాండే స్టైలే వేరు.

తాజాగా తూనీగ డిజైన్‌లో ఓ కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుంది. డిజైన్ చేయించుకున్నాకా ధరించాలిగా.! ధరించేసింది.

Ananya Panday Tooneega.. తూనీగా తూనీగా.. ఎగిరిపోమ్మా ఎందాకైనా.!

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. ఇలాంటి డ్రస్సులు కూడా వుంటాయా.? అనేంతలా వుంది. అచ్చు ఓ పెద్ద తూనీగా వచ్చి ఈ అందాల భామ ఎదపై వాలిందా.? అన్నటుగా డిజైన్ చేయించిన ఈ డ్రస్ చూసి నెటిజనం అవాక్కవుతూనే.. తమ కవి హృదయాలకి కూడా పని చెప్పేస్తున్నారు.

అంత కష్టపడి డిజైన్ చేయించుకున్న ఈ ఇన్నోవేటివ్ డ్రస్‌ని ప్రమోట్ చేసుకోవాలిగా.! ఇదిగో తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆ అందాల డ్రస్‌కి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేసింది.

అనన్యపై వాలింది నిజంగానే తూనీగ అనుకున్నారో ఏమో.! ప్చ్ అడ్డు తప్పుకో అందం కనిపించట్లేదు.. అంటూ తూనీగను బతిమలాడుకుంటున్నారు. అదీ సంగతి.!

ఇక, అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. లక్కు కలిసొస్తే.. ఈ పాప టాలీవుడ్‌లో ఎప్పుడో స్టార్ హీరోయిన్ అయిపోవాల్సింది.

బోణీ దెబ్బ కొట్టింది కానీ, లేకుంటేనా.!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ మూవీ ‘లైగర్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ బాలీవుడ్ తూనీగ.

అయితే, ‘లైగర్’ సినిమా ఫ్లాప్ అనడం చిన్న మాటే.. ఆ సినిమాని ఎంతలా తిట్టకూడదో అంతలా తిట్టి పోసి.. ఫెయిల్యూర్ కాదు కాదు డిజాస్టర్ ఖాతాలో వేసేశారు టాలీవుడ్ జనం.

Also Read: ‘లైగర్’ హీరో.! ‘యానిమల్’ బ్యూటీ.! కాంబినేషన్ కెవ్వు కేక.!

ఇక ఆ స్థాయిలో డెబ్యూ పడ్డాకా.. మరో అవకాశం వస్తుందా.? ఛాన్సే లేదు. రాలేదింతవరకూ. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అనన్య పాండేకి ఓ మోస్తరు స్టార్‌డమ్ వుందనుకోండీ.!

ఏమో.! అన్నీ కుదిరితే.. మళ్లీ టాలీవుడ్‌లో మంచి ఆఫర్‌తో అనన్య పాండే రీ ఎంట్రీ ఇస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Digiqole Ad

Related post