Ys Jagan Cricket Lokesh.. సినిమాని థియేటర్లలో చూడాలనుకుంటారు కొందరు.. ఇంట్లో, పెద్ద పెద్ద స్క్రీన్ల మీద (టీవీల్లో) చూసెయ్యాలనుకుంటారు మరికొందరు.!
చిన్న టీవీల్లో ఎప్పుడొస్తే, అప్పుడు చూసుకుందాంలే.. అనుకుంటారు ఇంకొందరు. ఎవరిష్టం వాళ్లది.! క్రికెట్ కూడా అంతే.!
స్టేడియంలో క్రికెట్ చూస్తే, ‘కిక్కు’ వస్తుంది కొందరికి. వేలాది మంది అభిమానుల మధ్య క్రికెట్ చూడటం అనేది కొంతమందికి చాలా చాలా ఇష్టం.
అందుకే, క్రికెట్ ఎప్పుడు ఎక్కడ జరిగినా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోడుతుంటాయ్. సెలబ్రిటీలు సైతం, క్రికెట్ స్టేడియంలకు తరలి వెళుతుంటారు.. ఆ ‘కిక్కు’ కోసమే.!
టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అలానే, క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు తిలకిస్తున్నారు ఈ మధ్య. వీలు చిక్కినప్పుడల్లా స్టేడియంకి వెళుతున్నారు.
Ys Jagan Cricket Lokesh.. జగన్‌ది అమాయకత్వమా.? మూర్ఖత్వమా.?
‘స్టేడియంలో చూడటమెందుకు.? ఇంట్లోనే టీవీల్లో చూడొచ్చు కదా.. నేనూ అలానే చూస్తున్నాను..’ అంటూ, లోకేష్ మీద రాజకీయ విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అసలేమన్నా అర్థం పర్థం వుందా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్లో.? క్రికెట్‌ని స్టేడియంలో చూడాలా.? టీవీల్లో చూడాలా.? అసలు చూడాలా.? వద్దా.? ఇవన్నీ నారా లోకేష్ వ్యక్తిగత వ్యవహారాలు.
కాస్తంత తీరిక సమయం చూసుకుని, స్టేడియంకి వెళ్ళి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్‌ని చూసొచ్చారు.. అదీ కొలంబోలో. ఆయనకేమీ, వీసా విషయంలో ఏ న్యాయస్థానం నుంచీ ఆంక్షలు లేవు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలా కుదరదు. అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడు అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీదున్నారు.
విదేశాలకు వెళ్ళాంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా న్యాయస్థానానికి ‘అభ్యర్థన’ అనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి వుంటుంది.
మంత్రి నారా లోకేష్‌ని రాజకీయంగా విమర్శించడానికి వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా అవకాశాలున్నాయి. పాలనాపరమైన లోపాల్ని ఎత్తి చూపొచ్చు.
కానీ, ఈ క్రికెట్ విమర్శలేంటి సిల్లీగా.! వారానికోసారి బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కి రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం.. ఏవో ఒకటి మాట్లాడేసి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవడం.. ఇదొక నిరంతర ప్రక్రియ అయిపోయింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
బెంగళూరుకి వెళ్ళిపోవడమెందుకు.? ఆ ప్యాలెస్సుని తాడేపల్లి నివాసం నుంచే టీవీలో చూసుకోవచ్చు కదా.?
అన్నట్టు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీ సమావేశాల్ని కూడా ఇంట్లోంచి చూసి ఆనందిస్తున్నారేమో.!
