YS Jagan Deepavali Trolling.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి దీపావళి పండుగని జరుపుకున్నారు.
వైసీపీ శ్రేణులు, షరామామూలుగానే, ఈ విషయాన్ని వైరల్ చేసేందుకు సోషల్ మీడియా వేదికగా చాలా చాలా కష్టపడ్డాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అన్ని మతాలకు సంబంధించిన పండుగలనూ జరుపుకునేందుకు స్వేచ్ఛ వుంది.
సమస్య ఏంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వివాదాన్ని మోస్తున్నారు.
YS Jagan Deepavali Trolling.. డిక్లరేషన్ రగడ..
వైఎస్ జగన్ క్రిస్టియన్.. అని, స్వయానా ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పలు సందర్భాల్లో చెప్పారు. అన్యమతస్తులు తిరుమల వెంకన్నని దర్శించుకోవాలంటే, డిక్లరేషన్ ఇవ్వాలి.
హిందూ మత సంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తి అయితే, డిక్లరేషన్ ఇచ్చి వుంటేవారే వైఎస్ జగన్.. అన్నది ఆయన మీదున్న విమర్శ.
‘నా మతం మానవత్వం’ అని చెబుతారు తప్ప, వైఎస్ జగన్.. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేలా డిక్లరేషన్ ఇవ్వరు. పైగా, ‘నాలుగ్గోడల మధ్య బైబిల్ చదువుతాను’ అని చెప్పుకున్నారాయన.

సరే, రాజకీయాలన్నాక విమర్శలు సహజం.. ప్రతిదీ రాజకీయ విమర్శగా మారడమూ సహజమే.! బాధ్యతగల వ్యక్తిగా, వివాదాస్పద అంశాల పట్ల సున్నితంగా వ్యవహరించి వుండాల్సింది వైఎస్ జగన్.
ఇక, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మీద మత పరమైన వివాదాస్పద ట్రోలింగ్ వైసీపీ శ్రేణులు చేస్తుంటాయి. వాటిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియంత్రించలేకపోతున్నారు.

దాంతో, వైఎస్ జగన్ మీద కూడా అంతకు మించిన ట్రోలింగ్ జరుగుతోంది. వైఎస్ జగన్ దీపావళి సంబరాల విషయంలో జరుగుతున్న ట్రోలింగ్ కూడా ఆ కోవలోనిదే.!
మొట్టమొదటిసారి వైఎస్ జగన్, దీపావళి పండుగ జరుపుకున్నారు.. ఓటమి తెచ్చిన మార్పు ఇది.. అంటూ, సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.
ఇది నిజమేనా.? ఇంతకు ముందెప్పుడూ వైఎస్ జగన్, దీపావళి పండుగని జరుపుకోలేదా.?
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
ఏది ఏమైనా, ప్రచారం కోసమే.. అన్నట్లు వైఎస్ జగన్ దీపావళి పండుగని ఈ ఏడాది జరుపుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇంతా చేసి, వైఎస్ జగన్ ‘నెగెటివిటీ’ తెచ్చుకుంటున్నారు తప్ప.. ఆయనకు ఈ ప్రచారం వల్ల అదనంగా ఒరిగేదేమీ లేదు.
