YS Jagan Insecurity Problem.. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏం మాట్లాడాం.? మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఏం మాట్లాడుతున్నాం.? కాస్తంత సోయ వుండకపోతే ఎలా వైఎస్ జగన్.?
అధికారంలో వున్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా చేసిన వ్యాఖ్యల్ని ఓసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెమరు వేసుకుంటే, ఇప్పుడాయన చేస్తున్న తప్పులు, గతంలో చేసిన తప్పులూ తెలిసొస్తాయ్.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ని కోరిన వైఎస్ జగన్, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు కూడా.
YS Jagan Insecurity Problem.. సీఎం స్థాయి భద్రత కావాలట..
2024 జూన్ 3 కంటే ముందున్న స్థాయి భద్రతను తనకు కల్పించాలటూ తాజాగా ‘పులివెందుల ఎమ్మెల్యే’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
తనకు ప్రాణ హాని వుంది గనుక, పూర్వపు భద్రతను పునరుద్ధరించాలన్నది వైఎస్ జగన్ డిమాండ్.
అయితే, జగన్‌కి మాజీ ముఖ్యమంత్రి హోదాలో అవసరమైన భద్రత ఇస్తున్నామనీ, ఆయనకు ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కొనసాగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.
Mudra369
అదసలు సాధ్యమేనా.? 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచాక, అప్పుడు మాజీ అయిన నారా చంద్రబాబునాయుడికి ‘సీఎం స్థాయి భద్రత’ని వైసీపీ ప్రభుత్వం కల్పించలేదు కదా.?
ఓ ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఇవ్వాలి.? ఓ ఎంపీకి ఎలాంటి భద్రత కల్పించాలి.? ఓ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇవ్వాల్సిన అవసరం వుంటుంది.? ఇవన్నీ పోలీస్ విభాగం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.
నవ్వులపాలవుతున్న కోర్కెల చిట్టా..
ఒకప్పుడు, అంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అసెంబ్లీలో, ప్రతిపక్ష హోదా గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఏం మాట్లాడారు.?
దేవుడి స్క్రిప్టు ప్రకారం టీడీపీకి 23 సీట్లే వచ్చాయనీ, అందులోంచి ఓ ఐదారుగుర్ని తాము లాగేస్తే, చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా కూడా వుండదని వైఎస్ జగన్ చెప్పారు కదా.!
Also Read: బడ్జెట్టు.. మాటల కనికట్టు.! అంతా హాంఫట్టు.!
మరి, అదే దేవుడు 2024 ఎన్నికల్లో (2024 Andhra Pradesh Elections) రాసిన స్క్రిప్టు ప్రకారం వైసీపీకి (YSR Congress Party) కేవలం 11 సీట్లే వచ్చాయి.
తమ అధినాయకుడ్ని ‘సింగిల్ సింహం’గా చెప్పుకుంటూ, ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద నానా రకాల దూర్భాషలాడిన వైసీపీ శ్రేణులు, ఇప్పుడు తమ అధినేత ‘ప్రాణ హాని’ అంటూ కోర్టును ఆశ్రయించడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
Mudra369
ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను ఎవరూ లాగెయ్యక్కర్లేదు.. ప్రతిపక్ష హోదాకి అవసరమైన (జగన్ చెప్పినట్లుగా) సీట్లు లేవు మరి వైసీపీకి.
న్యాయస్థానాల సమయం వృధా చేయడం తప్ప, వైఎస్ జగన్ పిటిషన్లతో ఉపయోగమేమీ వుండదు. సో.. తన గొంతెమ్మ కోర్కెల్ని జగన్ తగ్గించుకుంటే మంచిది.