Table of Contents
Budget Democracy Corruption.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.! బడ్జెట్ అన్నాక పెట్టాలి కదా.! కాబట్టి, ప్రవేశపెట్టేశారు.!
హల్వా వండుతారు.. లోక్ సభలో బడ్జెట్ గురించి చదువుతారు.. గొప్పలు చెప్పుకుంటారు.! ఏళ్ళ తరబడి నడుస్తున్న తంతు ఇది.!
ఇంతా చేసి, బడ్జెట్‌లో కొత్తదనం ఏముంటుంది.? సామాన్యుడికి ఊరట ఏముంటుంది.? ప్చ్.. ఏమీ వుండదు.!
Budget Democracy Corruption.. పన్నుల పండగ.. బడ్జెట్ దండగ..
కొత్తగా పన్నుల మోత మోగిపోతుంది. డైరెక్టుగానా.? ఇండైరెక్టుగానా.? అన్నదే తేడా.! ప్రతి ఏడాదీ బడ్జెట్ అంచనాలు పెరుగుతూనే వుంటాయ్.
పెట్రో ఉత్పత్తుల మీద పన్నుల పేరుతో కేంద్రం ఎంత దోచేస్తోందో తెలుసా.? ఇలా ప్రశ్నిస్తే, రాష్ట్రాలూ దోచేస్తున్నాయ్ కదా.. అంటారు కేంద్రంలో అధికారంలో వున్నోళ్ళు.! అంటే, డబుల్ దోపిడీ అన్నమాట.! ఇంకెందుకు జీఎస్టీ.?
Mudra369
రాబడి పెరుగుతుంది.. అప్పులూ పెరుగుతాయ్.. వసూళ్ళ సంగతి సరే సరి.! అసలంటూ ప్రభుత్వ ఖజానా అంటే ఏంటి.? ప్రజల పన్నులతో నిండేదే ప్రభుత్వ ఖజానా.!
సో, ఇక్కడ సామాన్యుడికి ఊరట అనేది ఏమీ వుండదు.! అందులో ఉచితాలుంటాయ్.. కానీ, అవి అనుచితమైనవే.!
ఇలా ఇచ్చి, అలా లాక్కోవడమే బడ్జెట్..
ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాక్కోవడమే బడ్జెట్. ఇచ్చేటప్పుడు గొప్పగా చెప్పి, లాక్కునేటప్పుడు మాత్రం సైలెంటుగా నొక్కేయడం ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య.
ఆర్థిక మంత్రిగా ఎవరున్నా చేసేదేం లేదు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో వున్నా చేసేదేం లేదు.
దేశ బడ్జెట్టు ప్రతియేడూ లక్షల కోట్ల పైన పెరుగుతూనే వుంటుంది.. దేశంలో పేదల సంఖ్యా పెరుగుతూనే వుంటుంది.. అదే విచిత్రం.! బడ్జెట్ ఎవరికోసం.? ఎందుకోసం.?
Mudra369
కాకపోతే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా, అభివృద్ధి కోసం నిధుల్ని వెచ్చిస్తే.. రాష్ట్రాలు, దేశం బాగుపడతాయి. కానీ, అలా చేస్తే.. ఓటు బ్యాంకు రాజకీయాలెలా నడిచేది.?
Also Read: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.!
మీడియా హైప్.. దీని గురించి బడ్జెట్ సమయంలో ఎంత చెప్పుకున్నా తక్కువే. మీడియాలో ఏవేవో లెక్కలు కనిపిస్తాయ్. కానీ, అవేవీ బడ్జెట్‌లో ప్రతిబింబించవు.
పుడితే పన్ను.. ఛస్తే పన్ను..
సామాన్యుడు అది కోరుకుంటున్నాడు.. సామాన్యుడు ఇది ఆశిస్తున్నాడు.. ఆ రంగం అలా.. ఈ రంగం ఇలా.. అని ఆర్థిక రంగ నిపుణులు న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో నెత్తీ నోరూ బాదుకుంటారు.
బడ్జెట్ వస్తుంది.. అన్ని వర్గాల్లోనూ నిట్టూర్పులు.. ఇది షరామామూలుగానే జరుగుతున్న తంతు.! ఈసారి కొత్తగా డిజప్పాయింట్ అయ్యేదేమీ లేదు. ఎప్పుడూ జరుగుతున్నదే.!
బడ్జెట్ అనగానే స్టాక్ మార్కెట్ల వైపు చూపు.. ఎగురుతాయ్.. కింద పడతాయ్ సూచీలు.! వీటి వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి.?
Mudra369
ఇంతకీ, లక్షల కోట్ల బడ్జెట్ ఏమైపోతున్నట్టు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.! సగం అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది.! సగం కాదు, అంతకు మించి.!
పుడితే పన్ను.. ఛస్తే పన్ను.. తుమ్మితే పన్ను.. దగ్గితే పన్ను.! రోడ్డెక్కితే పన్ను, ఇంట్లో అన్నీ మూడుచుకుని కూర్చుంటే పన్ను.! బడ్జెట్ అంటే ఇదే.!