Ys Jagan KTR Friendship.. లీడర్లు ఎప్పుడూ హ్యాపీగానే వుంటారు. ఏ ఎండకి ఆ గొడుగు.. అన్నట్టు వ్యవహరిస్తారు. క్యాడర్ పరిస్థితే దారుణంగా తయారవుతుంటుంది. రాజకీయం అంటేనే అంత.!
రాజకీయ నాయకులు సందర్భానుసారం మాత్రమే విమర్శలు చేస్తారు. వారి విమర్శల్ని క్యాడర్ సీరియస్‌గా తీసుకున్నప్పుడే సమస్యలొస్తాయ్. క్యాడర్‌ని రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవడమే నాయకుల పని.!
అసలు విషయంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, సోషల్ మీడియాలో తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దావోస్‌లో కలిసిన ఫొటోల్ని పోస్ట్ చేశారు.
నాయకులు అలా.! అభిమానులు ఇలా.!
నిజానికి, ఈ పొటోల్ని తప్పు పట్టాల్సిన పనేముంది.? తప్పు పట్టడం కాదు. ఇంత హ్యాపీగా.. అన్నదమ్ముల్లా నాయకులు కనిపిస్తున్నారు సరే, వారి క్యాడర్ ఎందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోయి, సచ్చిపోతున్నట్టు.?

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై తెలంగాణ మంత్రి కేటీయార్ సెటైర్లేశారు. దానికి ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ ఎంత తీవ్రంగా వచ్చిందో చూశాం.
టీఆర్ఎస్, వైసీపీ క్యాడర్ మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియాలో ఇది మరీ జుగుప్సాకరంగా నడిచింది. ‘మా కేటీయార్ గొప్ప..’ అని గులాబీ శ్రేణులు చెబితే.. ‘మా జగనన్న గొప్ప..’ అంటూ వైసీపీ శ్రేణులు నినదించాయి.
Ys Jagan KTR Friendship.. రాజకీయం ఇలాగే వుంటుంది మరి.!
అక్కడితో ఆగితే ఇంతలా మాట్లాడుకోవాల్సిన పనేముంది.? ‘మీ జగన్ గజ దొంగ..’ అన్నారు గులాబీ కార్మికులు. ‘మీ కేటీయార్ బూతుల రాయుడు..’ అన్నారు వైసీపీ కార్మికులు.
క్యాడర్‌ని ఇంతలా రెచ్చగొట్టేసి, ఇప్పుడు ఈ ఇద్దరూ.. ఎంచక్కా ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా దావోస్‌లో నీటుగా సూట్లు వేసుకుని.. నవ్వుతూ, ఆప్యాయంగా పలకరించుకుని, ఫొటోలుకు పోజులిచ్చి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: ఎన్టీయార్ శత జయంతి.! వెన్నుపోటు సంగతేంటి.?
‘ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ అనుచరుల్ని, అభిమానుల్ని రాజకీయ నాయకులు వెర్రి వెంగళప్పల్ని చేశారన్నమాట.!’ అని ఆయా నాయకుల అభిమానులే సోషల్ మీడియాలో వాపోయే పరిస్థితి వచ్చిందిప్పుడు.
నాయకులు రెచ్చగొట్టారు కదా.. అని రెచ్చపోవద్దని ఈ ‘కలయిక’ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టుంది కదూ.!
నాయకులు ఎలాగైతే కలిసిమెలిసి వుంటారో.. అప్పుడప్పుడూ రాజకీయాల కోసం తిట్టుకున్నట్టు నటిస్తారో… వారిని ఫాలో అయ్యే అభిమానులు కూడా అలాగే వుండాలి తప్ప.. అనవసర ఆవేశాలకు పోకూడదని మనవి.!