YS Jagan Padaidu Velu.. వై నాట్ 175 అన్నాడుగానీ, పదకొండు సీట్లకు పడిపోయాడు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎక్కడ విన్నా ఇదే చర్చ.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇలా పతనమవుతుందని అస్సలెవరూ ఊహించి వుండరు.
ఓడిపోవచ్చేమోగానీ, మరీ పదకొండు సీట్లకు పడిపోవడమేంటి.? అని వైసీపీ శ్రేణులు ఇప్పటికీ పిసుక్కుంటున్న వైనం అందరికీ కనిపిస్తూనే వుంది.
ఇదంతా స్వయంకృతాపరాధం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి, రాజకీయ ప్రత్యర్థుల వైవాహిక జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడో.. అప్పుడే అతని పతనం.. అత్యంత దారుణంగా డిసైడ్ అయిపోయింది.
YS Jagan Padaidu Velu.. ఈ పదైదు వేలు ముచ్చట ఏంటి.?
చంద్రబాబు అధికారంలోకి వస్తే, ‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు..’ ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా.? అంటూ జగన్ నిలదీసేస్తున్నారు.
రాజకీయాల్లో విమర్శలు సహజం. అలాగే ఎన్నికల హామీలు కూడా.! మద్య నిషేధంపై హామీ ఇచ్చిన వైఎస్ జగన్, మాట తప్పి.. మడమ తిప్పేయలేదా.?

అయినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చి, జస్ట్ రెండు నెలలే అయ్యింది. కనీసం ఆర్నెళ్ళ సమయం చంద్రబాబుకి ఇవ్వాలి.. ఆ తర్వాత నిలదీయాలి.!
అంటే, ఇప్పుడు నిలదీయకూడదని కాదు.! ఆర్నెళ్ళు వేచి చూడటం, విపక్షానికే ఉత్తమం.! ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయిన జగన్, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది.
జనం నవ్వుకుంటున్నారు..
కేవలం పదకొండు సీట్లకు పరిమితమైపోయిన వైఎస్ జగన్, ‘పదైదు వేలు.. పదైదు వేలు.. పదైదు వేలు..’ అంటూ పదే పదే మాట్లాడుతోంటే, జనం నవ్వుకుంటున్నారు.
చావు ఇంటికి వెళ్ళి కూడా వైఎస్ జగన్, ఇదే కామెడీ చేస్తోంటే.. కొంతమంది జనాలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.
Also Read: వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
వైసీపీ శ్రేణులు కూడా వైఎస్ జగన్ తీరుని సమర్థించలేకపోతున్నారు. ఒకే స్క్రిప్ట్ పదే పదే ప్లే చేసుకుంటూ పోతున్నట్లుందన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.
అంతకు ముందేమో, పెళ్ళిళ్ళు.. పెళ్ళాలు.. కార్లు.. భార్యలు.. అంటూ ఒకే డైలాగ్ పేల్చి, అధికారం కోల్పోయిన జగన్, ఇప్పుడు ‘పదైదు వేలు..’ డైలాగ్‌తో, ఎమ్మెల్యే హోదా కూడా కోల్పోయే పరిస్థితిని కొనితెచ్చుకునేలా వున్నారు.