Ys Jagan Padayatra Again.. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా.? అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజమైతే, వైఎస్ షర్మిల కూడా ముఖ్యమంత్రి అయిపోయి వుండాలి కదా.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు.. ముఖ్యమంత్రి పీఠమెక్కారు.! నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర చేశారు.. ముఖ్యమంత్రి పీఠం దక్కింది.
వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. అదే వైఎస్ జగన్, ఇంకోసారి పాదయాత్ర చేయబోతున్నారట.! ఈసారి ఏమవుతుందో.!
Ys Jagan Padayatra Again.. పాదాల మీద నడిచే యాత్ర…
తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. కానీ, తెలంగాణలో పార్టీని మూసేసుకోవాల్సి వచ్చింది.
అలా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పుడే, ‘పాదయాత్ర అంటే ఏంటో తెలుసా.? పాదాల మీద నడిచే యాత్ర’ అని చెప్పి, అందరి కళ్ళూ బైర్లు కమ్మేలా షాకిచ్చారు షర్మిల.
ఇక, జగన్ పాదయాత్ర విషయానికొస్తే, మార్నింగ్ వాక్ – ఈవినింగ్ వాక్.. అంటూ అప్పట్లో సెటైర్లు పడ్డాయ్. కానీ, ఆ సెటైర్లు కేవలం సెటైర్లుగా మిగిలిపోయాయి.. జగన్ అధికార పీఠమెక్కారు.
కాకపోతే, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయ్.! రాజకీయం చాలా మారింది. ఒక్క ఛాన్స్.. అని జగన్ బతిమాలుకుంటే, దక్కిన అవకాశమది. ఇప్పుడలా కాదు, జగన్ అంటే ఏంటో జనం చూసేశారు.
ఐదేళ్ళ వైఎస్ జగన్ పాలనలో అరాచకం రాజ్యమేలింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు వైఎస్ జగన్.
అదే, వైసీపీ కొంప ముంచింది. ఇప్పటికీ, రాజధానిపై వైసీపీ వైఖరి గందరగోళమే. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి, అడ్రస్ కోల్పోయిన వైఎస్ జగన్, ఇప్పటికీ అదే మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారు.
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
ఏమో, రానున్న రోజుల్లో రాజధానిపై జగన్ ఆలోచన మారుతుందేమో.! కొత్త హామీలతో, జనంలోకి జగన్ వెళతారేమో.! ప్చ్.. అయినా, లాభం లేదు. కంట్రోల్ చేయలేని స్థాయికి దిగజారిపోయింది వైసీపీ రాజకీయం.
గతంలో అయితే, టీడీపీ మాత్రమే జగన్‌కి ప్రత్యర్థి. ఇప్పుడు, జనసేన కూడా పూర్తిస్థాయి బలం పుంజుకుంది.
సో, పాచిపోయిన పాదయాత్ర వ్యూహంతో వైఎస్ జగన్ రాజకీయం చేస్తే డిజాస్టరయ్యే అవకాశాలే ఎక్కువ.
అన్నిటికీ మించి అప్పట్లో జగన్ రాజకీయానికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల.. అండగా వున్నారు. జగన్ కోసమే, షర్మిల అప్పట్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు.
మరి, ఇప్పుడు జగన్ పాదయాత్ర మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తేనో.?