Ys Jagan PPP Warning.. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణ వ్యవహారానికి సంబంధించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది.
ఈ విధానంలో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు దూరితే, తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారిని అరెస్ట్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత బెదిరింపులకు దిగారు ఇటీవలే.
ఆ బెదిరింపుల వల్లనే, ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి స్పందన లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తరఫున, కూటమి పార్టీల నేతల వ్యాఖ్యల సారాంశమిదే.
ఇంకో వైపు, తమ బెదిరింపులు పని చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది. ఇలా చెప్పుకోవడం బాధ్యతారాహిత్యం. మరోపక్క, చేతులెత్తేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
Ys Jagan PPP Warning.. పీపీపీ పాత వ్యవహారమే కదా.?
పీపీపీ విధానం.. అనేది అన్ని రంగాల్లోనూ చూస్తున్నదే. ఇదేమీ కొత్త విషయమేమీ కాదిది. వైసీపీ హయాంలోనూ, పీపీపీ విధానం వుంది.
పైగా, కేంద్రం ప్రతిపాదించిన విధానం ఈ పీపీపీ. వైసీపీ ఎంపీ కూడా, ఈ పీపీపీ ప్రతిపాదనకు సంబంధించిన కమిటీలో వున్నారు.
కానీ, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే.. తనదైన రీతిలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు.. బెదిరింపులకు దిగారు.. పెట్టుబడిదారులు భయపడ్డారు.
ఓ వ్యక్తి, ఓ ప్రభుత్వానికి చుక్కెదురయ్యేలా పెట్టుబడిదారుల్ని బెదిరించారంటే, దానర్థమేంటి.? రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా ప్రభుత్వం చూసుకోవడం లేదనే కదా.?
డ్యామేజ్ కంట్రోల్..
సరే, ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగి.. ఎలాగోలా, పీపీపీ విధానంలోకి ప్రభుత్వ వైద్య కళాశాలల్ని తీసుకు వస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
కానీ, బెదిరింపులకుు భయపడతారు.. అనే సందేశం అయితే, స్పష్టంగా వైఎస్ జగన్ పంపించగలిగారు. తాము ఎవర్నయినా బెదిరించగలం.. అనే అహంకారాన్ని ప్రదర్శించుకోగలిగారు విజయవంతంగా.
Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!
ప్రభుత్వం, ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ముందు చూపుతో వ్యవహరించి వుంటే, ఈ దుస్థితి వచ్చి వుండేది కాదు.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాంటి బెదిరింపులకు దిగేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. పెట్టుబడిదారుల్ని భయపెడితే, నష్టపోయేది ప్రజలు.
