డీఎన్ఏ రాజకీయం.! బొత్తిగా సిగ్గొదిలేశారు.!

Political DNA Media
Political DNA Andhra Pradesh.. ఓ ప్రజా ప్రతినిథి మీడియా ముందుకొచ్చి, మీడియా సంస్థల అధిపతులపైనా.. కొందరు జర్నలిస్టులపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.!
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. మీడియా వేరు, రాజకీయం వేరు కాదు.! రాజకీయం కంటే, మీడియా దిగజారిపోయిన పరిస్థితుల్ని చూస్తున్నాం.
అటు మీడియా, ఇటు రాజకీయం.. పోటీ పడి మరి, ప్రజల్లో పలచనైపోయాయ్. ప్రజల్ని ఏమార్చుతున్నాయ్. నిర్లజ్జగా బూతుల్ని జనాల్లోకి తీసుకెళుతున్నాయ్.
Political DNA Andhra Pradesh.. మీడియా పాపం ఎంత.?
ఇందులో మీడియా పాపం ఎంత.? రాజకీయం పాత్ర ఎంత.? అన్న విషయానికొస్తే, ఇద్దరిదీ క్షమించరాని పాపం, నేరం కూడా.!
ప్రస్తుతానికి మీడియా సంగతి పక్కన పెడదాం. ఇంకోసారి దాని గురించి చర్చించుకుందాం. రాజకీయాల గురించి ప్రస్తావించుకుందాం ఇప్పటికైతే.
సదరు ప్రజా ప్రతినిథి, మీడియా ముందుకొచ్చి, ‘మీ పుట్టుకలపై అనుమానం వుంది.. మీ తల్లిదండ్రులకి డీఎన్ఏ పరీక్షలు చేయాలి..’ అంటూ మీడియా సంస్థల అధిపతులపైనా, జర్నలిస్టులపైనా విరుచుకుపడిపోయాడు.
ఇక్కడ, ‘డు’ అన్న ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఆ స్థాయికి ఆయన దిగజారిపోయాడు గనుక. ‘పెద్దల సభకు’ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు కాబట్టి, ‘పెద్దలకు మాత్రమే’ డైలాగులు పేల్చుతున్నాడన్నమాట.
పెద్దల సభలో గద్దలు..
అసలు పెద్దల సభ.. అంటే, అర్థమేంటో తెలియని ఇలాంటి ‘పోరంబోకుల్ని చట్ట సభలకు’ పంపడమే అన్ని అనర్థాలకీ కారణమంటూ జనం, తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎన్ఏ పరీక్షలు చేయాలా.? ఎవరికి, మీడియా సంస్థల అధిపతులకా.? జర్నలిస్టులకా.? ఏం, మీలాంటి రాజకీయ నాయకులకు ఎందుకు చేయకూడదు.? లాజిక్కే కదా.!
నిజానికి, మీడియా సంస్థల్ని తమ గుప్పిట పెట్టుకుని, వాటి ద్వారా ప్రత్యర్తులపై రాజకీయ విషం చిమ్ముతున్నది ఇలాంటి రాజకీయ నాయకులే.
Also Read: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.!
అన్నట్టు, ఇక్కడ మనం చెప్పుకుంటున్న రాజకీయ నాయకుడు కూడా త్వరలో మీడియా సంస్థని నెలకొల్పుతాడట. అందులో ఏం రాయిస్తాడు.? ‘పెద్దలకు మాత్రమే’ కంటెంట్ జనాల్లోకి తీసుకెళతాడేమో.!
ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నది ఈ రాజకీయ ‘పండు కోతి’ మీద వచ్చిన ఆరోపణ. ఆరోపించింది కూడా, ఆ మహిళ భర్త. దాన్ని కవర్ చేసుకోలేక, మీడియా మీద పడి ఏడుస్తున్నాడన్నమాట.
